ETV Bharat / international

Space Tour: బెజోస్​ రోదసి యాత్రతో అరుదైన రికార్డు

ప్రపంచ కుబేరుడు జెఫ్​ జెజోస్​ అంతరిక్ష యాత్రలో ఒకేసారి రెండు అరుదైన రికార్డులు నమోదుకానున్నాయి. ఈ పర్యటనతో ఆలివర్, వేలీ చరిత్ర సృష్టించనున్నారు.

SPACE TOUR
రోదసి యానం
author img

By

Published : Jul 17, 2021, 12:51 PM IST

Updated : Jul 18, 2021, 11:59 AM IST

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఈ నెల 20న నిర్వహించే అంతరిక్ష యాత్రలో రెండు అరుదైన రికార్డులు నమోదు కానున్నాయి. ఈ కుబేరుడితో కలిసి 18 ఏళ్ల ఆలివర్‌ డేమన్‌ రోదసియాత్ర చేయబోతున్నారు. దీంతో అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందబోతున్నారు. అదే యాత్ర కోసం ఇప్పటికే ఎంపికైన వేలీ ఫంక్‌ (82).. అత్యంత ఎక్కువ వయసున్న వ్యోమగామి కానున్నారు.

ఈ యాత్ర కోసం బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ అంతరిక్ష సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా 2.8 కోట్ల డాలర్లకు ఓ ధనికుడు టికెట్‌ సంపాదించారు. అయితే ఇతరత్రా పనుల కారణంగా ఆయన తన యాత్రను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆ సీటును ఆలివర్‌కు కేటాయించారు. ఇందుకు ఆ కుర్రాడు ఎంత చెల్లించాడన్నది ఇంకా వెల్లడి కాలేదు. 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌకలో అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఈ యాత్ర నిర్వహించనున్నారు. 2020లో హైస్కూల్​ చదువును పూర్తిచేసుకున్న ఆలివర్‌.. ప్రైవేటు పైలట్‌ లైసెన్సు కోసం ఏడాది పాటు చదువుకు బ్రేక్‌ ఇచ్చారు. నెదర్లాండ్స్​లోని ఉట్రెక్ట్‌ విశ్వవిద్యాలయంలో చేరనున్నారు.

ప్రస్తుతం.. రోదసిలోకి వెళ్లిన అత్యంత పిన్న వయస్కుడిగా సోవియట్‌ వ్యోమగామి ఘెర్మోన్‌ టిటోవ్‌ గుర్తింపు పొందారు. 1961లో రోదసి యాత్ర చేసినప్పుడు ఆయన వయసు 25 ఏళ్లు. ఈ రికార్డును ఆలివర్‌ అధిగమించనున్నారు.

ఇదీ చూడండి: బెజోస్​తో స్పేస్​ ట్రిప్​కు రూ.206 కోట్లు చెల్లించి.. ఇప్పుడేమో..

Last Updated : Jul 18, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.