ETV Bharat / international

'ఓట్లు వేయకపోతే ట్రంప్​ తిరిగొస్తారు.. జాగ్రత్త'

డెమొక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ తరఫున తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా. ట్రంప్​ తనను తాను రక్షించుకోలేరని.. ఇక ప్రజలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయకపోతే.. ట్రంప్​ మరోమారు అధ్యక్ష పదవి చేపట్టే ప్రమాదం ఉందన్నారు.

obama-launches-fiery-attack-on-trump-says-he-cant-even-take-basic-steps-to-protect-himself
'ఓట్లు వేయకపోతే ట్రంప్​ తిరిగొస్తారు.. జాగ్రత్త'
author img

By

Published : Oct 22, 2020, 8:11 AM IST

Updated : Oct 22, 2020, 8:41 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా. తనను తాను కాపాడుకునేందుకు ప్రాథమిక సూత్రాలను కూడా పాటించలేని వ్యక్తి.. ఉన్నపళంగా ఇతరుల జీవితాలను ఎలా రక్షించగలరని మండిపడ్డారు. డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ తరఫున తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒబామా.. ఫిలడెల్ఫియాలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"కరోనా సంక్షోభం మొదలై 8నెలలు గడుస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఉన్నపళంగా ట్రంప్​ ప్రజలను రక్షించలేరు. తనను తాను కాపాడునేందుకు కనీసం ప్రాథమిక సూత్రాలను కూడా పాటించలేరు. ఇది రియాలిటీ షో కాదు. ఇది వాస్తవం. బాధ్యతలను ట్రంప్​ తీవ్రంగా పరిగణించకపోవడం, ఆయన అసమర్థత వల్ల కలిగే సమస్యలు ప్రజలపై ప్రభావం చూపుతాయి."

--- బరాక్​ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.

జో బైడెన్​- కమలా హారిస్​ నేతృత్వంలో ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చన్నారు ఒబామా.

ఇదీ చూడండి:- అమెరికాలో జోరుగా ముందస్తు ఓటింగ్​

'ఓట్లు వేయండి...'

ఫిలడెల్ఫియా ఓటర్లు, ముఖ్యంగా నల్లజాతి వారు అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండవద్దని మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా అభ్యర్థించారు. ప్రజలు ఓట్లు వేయకపోతే ట్రంప్​ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రమాదం ఉందని తెలిపారు.

కరోనా సంక్షోభం ఏ అధ్యక్షుడికైనా క్లిష్టంగానే ఉంటుందని.. కానీ దానిని ట్రంప్​ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు, కరోనాపై దుష్ప్రచారం, నాయకత్వంలో అసమర్థతను ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు ఒబామా.

ఇదీ చూడండి:- 'అందులో నేనే కింగ్​- లాబీయిస్టులకు బైడెన్​ సేవకుడు'

Last Updated : Oct 22, 2020, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.