ETV Bharat / international

'క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా' - స్వల్ప లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి

ఉత్తర కొరియా తాజాగా స్వల్ప లక్ష్యాల్ని ఛేదించగల క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా-దక్షిణకొరియా సంయుక్త మిలిటరీ ఆపరేషన్స్​ నేపథ్యంలో ఈ ప్రయోగానికి సాహసించిందని బైడెన్​ బృందంలోని ఇద్దరు అధికారులు పేర్కొన్నారు.

North Korea conducted short-range missile test
'క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా'
author img

By

Published : Mar 24, 2021, 8:15 AM IST

స్వల్ప లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న క్షిపణులను ఉత్తరకొరియా గతవారం ప్రయోగించినట్లు బైడెన్ బృందంలోని ఇద్దరు అధికారులు స్పష్టం చేశారు. అమెరికా-దక్షిణకొరియా సంయుక్త సైనిక విన్యాసాలను విమర్శిస్తూ ఇటీవల పలు హెచ్చరికలు చేశారు కిమ్​ సోదరి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా.. క్షిపణి పరీక్షలకు సాహసించిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.

ఇరు దేశాలు చర్చలు జరుపుకోవాలని జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా సర్కారు కోరినా ఉత్తరకొరియా అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో చైనాను అస్త్రంగా సంధించి ఉత్తరకొరియా అణుకార్యకలాపాలకు చెక్​ పెట్టాలని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అశించారు. ఇటీవలే చైనా ఉన్నాతాధికారులతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు.

ఇదీ చదవండి:పుతిన్.. కొవిడ్ టీకా తీసుకున్నారట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.