ETV Bharat / international

లూయిస్​ గ్లక్​కు నోబెల్​ 'సాహిత్య' పురస్కారం - స్వీడిష్​ రాయల్​ అకాడమీ

అమెరికాకు చెందిన ప్రముఖ కవయిత్రి లూయిస్​ గ్లక్​కు... సాహిత్య రంగంలో నోబెల్​ పురస్కారం దక్కింది. అవార్డు గ్రహీతకు బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు బహుమతి కూడా లభిస్తుంది.

louise gluck nobel prize
లూయిస్​ గ్లక్​కు నోబెల్​ 'సాహిత్య' పురస్కారం
author img

By

Published : Oct 8, 2020, 4:41 PM IST

Updated : Oct 9, 2020, 9:16 AM IST

2020 నోబెల్​ సాహిత్య పురస్కారం అమెరికాకు చెందిన ప్రముఖ కవయిత్రి లూయిస్ గ్లక్​ను వరించింది. వ్యక్తిగత జీవితాలకు తన అత్యద్భుతమైన సాహిత్యంతో గళం ఇచ్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది.

అవార్డు గ్రహీతకు బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు బహుమతి కూడా లభిస్తుంది.

77ఏళ్ల గ్లక్​.. యాలే విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. 1968లో విడుదలైన "ఫస్ట్​బార్న్​" అనే పుస్తకంతో సాహిత్య ప్రపంచానికి పరిచయమయ్యారు​. ఆ తర్వాత కొద్ది కాలంలోనే.. అమెరికా సాహిత్య ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. బాల్యం, కుటుంబ జీవితం, తల్లిదండ్రులు-తోబుట్టువుల చుట్టూ ఆమె కవితలు అల్లుకుని ఉంటాయి.

2018లో...

నోబెల్​ సాహిత్య పురస్కారానికి ఘన చరిత్రే ఉంది. అయితే 2018లో దానిపై ఊహించని రీతిలో మచ్చ పడింది. విజేతను నిర్ణయించే స్వీడిష్​ కమిటీలో లైంగిక వేధింపుల వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది పురస్కారాన్ని వాయిదా వేశారు. 2018తో పాటు 2019ని కలిపి ఒకేసారి ఇచ్చారు.

సాహిత్యంతో పాటు ఈ ఏడాది ఇప్పటికే వైద్య, రసాయన, భౌతిక శాస్త్ర రంగాల్లో నోబెల్​ పురస్కారాలను ప్రకటించింది రాయల్​ స్వీడిష్​ అకాడమీ. శుక్రవారం ప్రతిష్టాత్మక నోబెల్​ శాంతి బహుమతిని ప్రకటించనుంది.

ఇవీ చూడండి:-

Last Updated : Oct 9, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.