కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చుతోందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని హెచ్చరించారు. ఐరోపా, ఆసియా దేశాల్లో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చినప్పటికీ చాలా మంది వైరస్ పోకడలను తప్పు దిశలో అర్థం చేసుకుంటునట్లు తెలిపారు.
కరోనా వ్యాప్తి, అది కలిగిస్తున్న నష్టం గురించి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను వారి పేరు ప్రస్తావించకుండా ఖండించారు. ఆయా దేశాల్లో పెరుగుతున్న కేసులను అరికట్టడానికి సమగ్రమైన వ్యూహాన్ని అవలంబించాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. కొత్త కేసుల్లో సగం వరకూ అమెరికా నుంచే వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కరోనా నుంచి బయట పడటానికి సరైన ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. వాటిని ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మహమ్మారి విజృంభించే ప్రాంతాల్లో అమలు చేయాలని టెడ్రోస్ సభ్యదేశాలను కోరారు.
ఇదీ చూడండి: ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం చైనా ప్రార్థనలు!