ETV Bharat / international

'సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు' - పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి

అమెరికాలో జరుగుతున్న అల్లర్లపై స్పందించారు పలువురు ప్రముఖులు. సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి తావులేదన్న మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదేళ్ల.. ఇతరుల భావాలను అర్థం చేసుకోవాలన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలవాలని పెప్సికో మాజీ సీఈఓ నూయి పిలుపునిచ్చారు.

No place for hate racism in society Satya Nadella
'సమాజంలో ద్వేషం, జాత్యహంకారం లేదు'
author img

By

Published : Jun 2, 2020, 11:52 AM IST

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంపై మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదేళ్ల సహా ప్రముఖులు స్పందించారు. సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదన్న సత్య నాదేళ్ల..ఇతరుల భావాల్ని అర్థం చేసుకొని గౌరవించాలన్నారు. నల్లజాతి, ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతామని ఆ సంస్థ ప్రకటించింది.

  • As protests sweep the country, we all have a role to play. Below, I offer reflections about what this moment means for our country and how we can listen, learn, and act. #BlackLivesMatter pic.twitter.com/qnaOIA7Gc9

    — Indra Nooyi (@IndraNooyi) June 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నల్లజాతి అమెరికన్ల బాధను వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి వ్యాఖ్యానించారు. న్యాయం కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలవాలని ఈ గాయాన్ని ఎలా నయం చేయాలో కూడా ఆలోచించాలని నూయి భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

ఆఫ్రికన్‌-అమెరికన్లకు బాసటగా అమెరికాలోని గూగుల్‌, యూట్యూబ్‌ హోం పేజీలను మార్చినట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. ఆవేదనతో పోరాడుతున్న వారు ఏకాకులు కాదని, జాతి సమానత్వం కోసం ఉద్యమిస్తున్నవారికి సంఘీభావంగా నిలుస్తామని పిచాయ్‌ తెలిపారు.

ఇదీ చూడండి:విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.