ETV Bharat / international

పావు వంతు ఇళ్లకే ఇంటర్నెట్​ సౌకర్యం: యునిసెఫ్​ - యునిసెఫ్​ తాజా నివేదిక

ఆన్​లైన్​ తరగతులు నిర్వహించేందుకు దేశంలో సరైన సదుపాయాలు లేవని యునిసెఫ్​ వెల్లడించింది. అందుకే ఆన్​లైన్​ చదువులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని తాజా నివేదికలో ప్రకటించింది యునిసెఫ్​. ప్రపంచ వ్యాప్తంగా కేవలం పావు వంతు మంది విద్యార్థులకే ఇంటర్నెట్​ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపింది.

No more Internet facilities in India for Online classes: UNICEF
పావు వంతు ఇళ్లకే ఇంటర్నెట్
author img

By

Published : Aug 28, 2020, 8:06 AM IST

కరోనా కారణంగా భారత్​లో ఆన్​లైన్​ తరగతులు నిర్వహించేందుకు అనువైన సదుపాయాలు లేవని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్​ పేర్కొంది. కేవలం 24 శాతం ఇళ్లకే ఇంటర్నెట్​ సౌకర్యం ఉన్నందున చాలా మంది పిల్లలకు ఆన్​లైన్​ విద్య అందుబాటులో ఉండే అవకాశాలు లేవని తెలిపింది.

ఆన్​లైన్​ విధానంలో బోధనా సౌకర్యాలు లేనందున నగర-గ్రామ ప్రాంతాలు, ధనిక-పేద వర్గాల మధ్య అంతరాయం కనిపిస్తోందని పేర్కొంది. కొన్ని చోట్ల బాలికలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచడం లేదని తెలిపింది. స్మార్ట్​ ఫోన్​లు ఉన్నా కనెక్టివిటీ సౌకర్యం తగినంతగా లేకపోవడం, ప్రాంతీయ భాషల్లో పాఠాలు అందుబాటులో లేకపోవడం మరికొన్ని లోపాలని వివరించింది.

'ఇతర మార్గాలు అన్వేషించాలి'

దేశంలో 15 లక్షల పాఠశాలలు ఉండగా.. సెకండరీ స్థాయి వరకు 28.6 కోట్ల మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో 49 శాతం మంది బాలికలే. కరోనా కారణంగా వీరందరి చదువులూ ఇబ్బందుల్లో పడ్డాయి. వీరు కాకుండా మరో 60 లక్షల మంది పిల్లలు కరోనాకు ముందునుంచే పాఠశాలలకు దూరంగా ఉంటున్నారు. పిల్లలు ఇళ్ల దగ్గరే చదువుకొనేలా ఇతర మార్గాలను కూడా అన్వేషించాలని యునిసెఫ్​ భారత ప్రతినిధి యూస్మిన్​ అలీ హక్​ ప్రభుత్వానికి సూచించారు.

ప్రపంచంలో మూడొంతుల మందికి..

ప్రపంచంలో మూడొంతుల మంది విద్యార్థులకు ఇంటర్నెట్​ సౌకర్యం లేదని యునిసెఫ్​ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడటం విద్యా రంగంలో అత్యయిక పరిస్థితి లాంటిదని అభివర్ణించింది. కనీసం 46.3 కోట్ల మంది విద్యార్థులకు ఇంటర్నెట్​ అంటే ఏమిటో తెలయదని గుర్తుచేసింది. కరోనాతో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల విద్యార్థులు అధికంగా ప్రభావితమయ్యారని తెలిపింది. ఇంటర్నెట్​ సౌకర్యం ఉన్నా.. తగిన వాతావరణం లేక చదువులు సక్రమంగా సాగడం లేదని పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనా పంజా: బాల కార్మికులుగా లక్షలాది మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.