ETV Bharat / international

కొత్త రూల్​- చిన్న పిల్లలకు కేక్, ఐస్​క్రీమ్​ బంద్!

author img

By

Published : Dec 30, 2020, 10:57 AM IST

రెండేళ్ల లోపు చిన్నారులకు ఐస్​క్రీమ్​, కేక్​ లాంటి తీపి పదార్థాలు ఆహారంగా ఇవ్వకూడదని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఇటీవలే విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో ఈమేరకు పేర్కొంది.

No candy and cake for kids under 2 says New US dietary guidelines
రెండేళ్ల లోపు పిల్లలకు ఈ ఆహార నిబంధనలు తప్పనిసరి!

రెండేళ్ల లోపు పిల్లలకు తీపి పదార్థాలు ఆహారంగా పెట్టకూడదని అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో పేర్కొంది. పిల్లలకు కనీసం ఆరు నెలలైనా తల్లి పాలు తాగించాలని సూచించింది. ఐస్​క్రీమ్​, కేక్​ వంటి పదార్థాలకు దూరంగా ఉంచాలని కోరింది.

మొదటి దశలో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం చాలా ముఖ్యమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పోషకాహార నిపుణులు బార్బరా ష్నీమన్​ అన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

రెండింట్లో మార్పులేకుండానే..

రోజువారీ ఆహారంలో చక్కెర శాతం 6 కన్నా తక్కువగా ఉండాలని, మద్యం సేవించే పురుషులు ఒక డ్రింక్​కు మాత్రమే పరిమితం కావాలనే మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు శాస్త్రవేత్తలు. కానీ, మొత్తం క్యాలరీల్లో చక్కెర శాతం 10 కన్నా తక్కువగా ఉండాలని, మద్యం సేవించే పురుషులు రెండు డ్రింక్​లకు పరిమితం కావాలనే పాత మార్గదర్శకాల్లో ఏ మార్పు జరపలేదు అమెరికా ప్రభుత్వం.

ఈ ఆహార మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ ప్రతి ఐదు సంవత్సరాలకోసారి విడుదల చేస్తాయి.

ఇదీ చదవండి:'ఇలా అయితే టీకా అందేసరికి ఏళ్లు గడిచిపోతాయ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.