ETV Bharat / international

'స్పెల్లింగ్​ బీ' పోటీల్లో తెలుగోళ్ల సత్తా! - స్పెల్లింగ్​ బీ

అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్​ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఫైనల్స్​కు ఎంపికైన మొత్తం 11 మంది విద్యార్థుల్లో 9 మంది భారత సంతతికి చెందిన వారే ఉండటం విశేషం.

spelling bee
స్పెల్లింగ్ బీ
author img

By

Published : Jun 29, 2021, 1:30 PM IST

ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ సారి 11 మంది విద్యార్థులు ఫైనల్స్​కు ఎంపికయ్యారు. అయితే.. వీరిలో 9 మంది భారత సంతతికి చెందిన విద్యార్థులే ఉండటం విశేషం.

జులై 8న ఫ్లోరిడాలో 'నేషనల్ స్పెల్లింగ్​ బీ ఫైనల్స్' జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 209 మంది విద్యార్థులకు బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్​. జే మైఖేల్​ డర్నిల్​ శుభాకాంక్షలు తెలిపారు.

ఫైనల్స్​కు చేరింది వీరే..

  • రాయ్ సెలిగ్​మాన్​(12), నసౌ- బహమాస్
  • భావన మదిని(13), న్యూయార్క్​
  • శ్రీతన్ గాజుల(14), ఛార్లోట్​, ఉత్తర కరోలినా
  • అశ్రిత గంధారి(14), వర్జీనియా
  • అవని జోషి(13), ఇలినాయిస్
  • జైలా అవంత్​- గార్డె(14), లీస్​బర్గ్
  • వివిన్షా వెదురు(10), టెక్సాస్
  • ధ్రువ్ భరతియా(12), డాలస్
  • విహాన్ సిబాల్​(12), టెక్సాస్
  • అక్షిని కమ్మ(13), టెక్సాస్​
  • చైత్ర తుమ్మల(12), శాన్​ఫ్రాన్సిస్కో

కరోనా కారణంగా 2020లో స్పెల్లింగ్ బీ పోటీలను రద్దు చేశారు. 2019లో జరిగిన పోటీల్లో 8 మంది విజేతలుగా నిలవగా.. అందులో ఆరుగురు భారత సంతతికి చెందిన విద్యార్థులే కావటం విశేషం.

ఇదీ చదవండి: భారత్​కు మరోసారి అమెరికా భారీ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.