ETV Bharat / international

ట్రంప్​ ఆరోగ్యం ఆందోళనకరం! రాబోయే 48 గంటలు కీలకం - ట్రంప్ కరోనా న్యూస్​

కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రానున్న 48 గంటలు అత్యంత కీలకమని పేర్కొన్నాయి. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పాయి. జ్వరం గానీ, శ్వాస ఇబ్బందులు గానీ లేవని స్పష్టం చేశాయి.

next 48 hours crucial for trump corona treatment
ట్రంప్​ ఆరోగ్యం ఆందోళనకరం!.. రాబోయే 48 గంటలు కీలకం
author img

By

Published : Oct 4, 2020, 4:33 AM IST

Updated : Oct 4, 2020, 6:48 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఆయనకు రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని తెలిపాయి. ట్రంప్​ వైరస్ బారిన పడిన తర్వాత 24 గంటల పాటు ముఖ్యమైన అవయవాలు కలవరపెట్టినట్లు వివరించాయి.

అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల్లో ఆయనకు జ్వరం కూడా లేదని వెల్లడించారు. ప్రస్తుతం కొద్దిగా దగ్గు, ముక్కు దిబ్బడతో బాధ పడుతున్నారని.. అలసటగా ఉన్నారని ట్రంప్‌ వైద్యుడు సీన్‌ కాన్లీ ప్రకటించారు. ఈ సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు.

తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ట్రంప్‌ కూడా ట్వీట్‌ చేశారు. ట్రంప్​కు ఆక్సిజన్‌ సహకారం అవసరం కాలేదని.. ఎలాంటి శ్వాస సమస్యలు లేవని మరో వైద్యుడు తెలిపారు. ఆయనకు కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు వెల్లడించారు. ట్రంప్‌ సతీమణి మెలానియా కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

కరోనా బారిన పడిన అనంతరం చికిత్స కోసం శుక్రవారం వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో చేరారు ట్రంప్​.

Last Updated : Oct 4, 2020, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.