ETV Bharat / international

కొవిడ్​పై​ పోరులో భారత్​కు మరో మూడు దేశాల చేయూత - స్విట్జర్లాండ్ సాయం

కొవిడ్​పై పోరు కొనసాగిస్తున్న భారత్​కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా కెనడా, న్యూజిలాండ్​, స్విట్జర్లాండ్ దేశాలు తమవంతు సాయం ప్రకటించాయి.

Canada,modi
కొవిడ్​ పోరులో భారత్​కు కెనడా, న్యూజిలాండ్​ చేయూత
author img

By

Published : Apr 28, 2021, 9:37 PM IST

కరోనాపై భారత్​ చేస్తోన్న పోరాటంలో కెనడా మద్దతుగా నిలిచింది. ఈ మేరకు 10 మిలియన్ డాలర్లను సాయంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మరే ఇతర సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తో తమ ప్రతినిధి సంభాషించినట్లు వివరించారు. తక్షణమే తాము కేటాయించిన మొత్తాన్ని ఇండియన్​ రెడ్​ క్రాస్​కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.

న్యూజిలాండ్​ సాయం...

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సాయం చేయడానికి న్యూజిలాండ్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సుమారు 7,20,365 డాలర్లను రెడ్‌క్రాస్‌ అందజేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి నానియా మహుటా బుధవారం ప్రకటించారు.

స్విట్జర్లాండ్​ సైతం..

భారత్​లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అవసరమైన వైద్య సామాగ్రిని పంపిస్తున్నట్లు స్విట్జర్లాండ్ తెలిపింది. మానవతా సాయంగా భారత్​కు వైద్య పరికరాలు అందిస్తున్నట్లు దేశంలోని స్విస్​ రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి సాయానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: భారత్‌కు సాయం ప్రకటించిన పాక్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.