ETV Bharat / international

కరోనా వేళ అంతుచిక్కని వ్యాధి.. 21 ఏళ్ల లోపువారు జాగ్రత్త!

కరోనా వైరస్​కు తీవ్రంగా ప్రభావితమైన అమెరికాలోని న్యూయార్క్​ నగరంలో.. కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. అక్కడి చిన్నారులు మరో ప్రమాదకర వ్యాధి బారిన పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన 110 కరోనా కేసులను పరిశీలిస్తున్నారు. వైరస్ బారిన పడిన చిన్నారుల్లోనే ఈ లక్షణాలు కన్పిస్తుడటం ఆందోళన కల్గించే అంశమని అధికారులు తెలిపారు.

110 cases of COVID-related rare inflammatory illness in children:
కొవిడ్​ సోకిన చిన్నారుల్లో ప్రమాదకర వ్యాధి లక్షణాలు!
author img

By

Published : May 15, 2020, 5:44 PM IST

అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువు న్యూయార్క్ నగరం. ఇప్పుడు ఆ రాష్ట్రంలోని చిన్నారుల్లో మరో ప్రమాదకర వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన వారిలోనే ఈ లక్షణాలు ఉండటం అక్కడి యంత్రాంగానికి మరింత ఆందోళన కల్గించే అంశం. ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడి ఇప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వీరి వయసు 2, 5, 7 ఏళ్లు అని వివరించారు గవర్నర్​ ఆండ్రూ క్యూమో. న్యూయార్క్​లో అరుదైన ఇన్​ఫ్లమేటరీ ఇల్​నెస్​కు​ గురవుతున్న 110 కేసులపై అధ్యయనం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

కొవిడ్-19తో సంబంధమున్న ఈ ప్రమాదకర వ్యాధిని పిడియాట్రిక్ మల్టీ సిస్టమ్​ ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్​గా గుర్తించారు. కవాసాకి, టాక్సిక్​​ షాక్​ సిండ్రోమ్ లాంటి వ్యాధి అని వివరించారు. పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉన్నట్లు క్యుమో తెలిపారు. న్యూయార్క్​లోనే కాకుండా మరో 16 రాష్ట్రాల్లోని చిన్నారుల్లోనూ ఈ వ్యాధి లక్షణాలు గుర్తించామని.. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

తల్లిదండ్రులందరూ అప్రమత్తంగా ఉండాలని, పిల్లలలో ఐదు రోజులకు పైబడి జ్వరం వచ్చినా.. చర్మం రంగులో మార్పు, కడుపు నొప్పి, పాలు తాగకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య సాయం తీసుకోవాలని క్యూమో సూచించారు. కొవిడ్​ బారిన పడిన చిన్నారులు, యాంటీబాడీస్ తక్కువగా ఉన్న చిన్నారులనే ఈ వ్యాధి లక్ష్యంగా చేసుకుంటోదని తెలిపారు. ఏడాది లోపు చిన్నారుల నుంచి 21 ఏళ్ల వయసు వారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోందని.. వారంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని భావిస్తున్న తరుణంలో.. వారే అరుదైన అనారోగ్యానికి గురవడం సమస్యాత్మకమని చెప్పారు న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లేసియో. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 మంది చిన్నారుల్లో ఈ ప్రమాదకర వ్యాధిని గుర్తించగా.. వారిలో 55 మంది కరోనా బారిన పడినవారేనని ఆయన అన్నారు. కొవిడ్ సోకిన ఎక్కువ మంది చిన్నారుల్లో లక్షణాలు స్వల్పంగానే బయటపడుతున్నప్పటికీ... బ్రిటన్​లోనూ ప్రమాదకర వ్యాధికి కరోనాతో సంబంధాలున్నట్లు గుర్తించారని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.