ETV Bharat / international

అమెరికాలో మరో ఫాస్టెస్ట్​ సూపర్​ కంప్యూటర్​ సిద్ధం!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితాలో త్వరలోనే మరోకటి చేరనుంది. ఈ సూపర్​ కంప్యూటర్​ను అమెరికాలోని వ్యోమింగ్​ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు. సెకనుకు 20 క్వాడ్రిలియన్​ లెక్కలు చేయగల ఈ కంప్యూటర్​ ద్వారా.. ప్రకృతి విపత్తుల వంటి వాటిని ముందస్తుగా తెలుసుకునే వీలుకలుగనుంది.

author img

By

Published : Jan 28, 2021, 10:52 AM IST

super computer
ప్రంపంచంలోనే ఫాస్టెస్ట్​ సూపర్​ కంప్యూటర్​ ఇదే

ప్రపంచంలో అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూటర్ల​ జాబితాలో మరో సూపర్​ కంప్యూటర్ త్వరలోనే​ చేరనుంది. అమెరికా వ్యోమింగ్​లోని చెయెన్నే సూపర్​ కంప్యూటింగ్​ సెంటర్​లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. వాతావరణ మార్పులు, కార్చిచ్చులు, సౌర మార్పులు.. వంటివి అధ్యయనం చేయడంలో ఈ సూపర్​ కంప్యూటర్​ అత్యంత వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హ్యూస్టన్​కు చెందిన హెవ్లెట్​ ప్యాకర్డ్​ ఎంటర్​ప్రైజెస్​(హెచ్​పీఈ) అనే సంస్థ.. ఈ సూపర్​ కంప్యూటర్​కు కావాల్సిన యంత్ర పరికరాలను సరఫరా చేయడానికి సిద్ధమైంది. 35 నుంచి 45 మిలియన్ల డాలర్ల వరకు దీని కోసం ఖర్చు చేయనుంది. ఈ మేరకు కొలరాడోలోని నేషనల్​ సెంటర్​ ఫర్​ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్​(ఎన్​సీఏఆర్​) బుధవారం తెలిపింది.

హెచ్​పీఈ-క్రే ఎక్స్​గా వ్యవహరిస్తున్న ఈ సూపర్​ కంప్యూటర్​.. సెకనుకు 20 క్వాడ్రిలియన్​ లెక్కలు చేయగలదు. ఎన్​సీఏఆర్​లో ఉన్న సూపర్​ కంప్యూటర్ల కంటే మూడు రెట్లు అధిక వేగంతో పని చేయనుంది. ఈ ఏడాది ప్రపంచంలోని 25 ఫాస్టెస్ట్​ సూపర్​ కంప్యూటర్ల జాబితాలో ఈ కంప్యూటర్​ చేరనుంది. 2022లో దీన్ని వినియోగించనున్నారు. విపత్తుల గురించి ముందుగానే తెలుసుకోవండంలో ఈ సూపర్​ కంప్యూటర్​ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్​సీఏఆర్​ పేర్కొంది. వ్యోమింగ్​లోని పాఠశాల విద్యార్థులకు ఓ పోటీ నిర్వహించి, అందులో విజేతలకు ఈ సూపర్​ కంప్యూటర్​కు పేరు పెట్టే అవకాశాన్ని కల్పించనున్నారు.

ఇదీ చూడండి:తొలి ప్రైవేటు అంతరిక్షయాత్ర.. టికెట్టు ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.