ETV Bharat / international

'ఈ సెన్సార్​తో క్షణంలో కరోనా ఫలితం' - కరోనా

ఒక్క సెకనులోనే కరోనా ఫలితాన్నితెలిపే కొత్త సెన్సార్​ సిస్టంను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ప్రస్తుతం కరోనా పరీక్షల కోసం వినియోంగించే ఆర్​టీ పీసీఆర్​ కిట్​ కంటే ఇది కచ్చితంగా, వేగంగా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

COVID-19
కరోనా
author img

By

Published : May 20, 2021, 5:22 PM IST

కేవలం ఒక్క సెకనులోనే కరోనా ఫలితాన్ని తెలిపే కొత్త సెన్సార్​ సిస్టంను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం కరోనా పరీక్షలను జరిపే పద్ధతుల కంటే దీని ద్వారా వేగంగా ఫలితాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం వాక్యూమ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ బీ, అనే జర్నల్​లో ప్రచురితం అయింది.

పరీక్ష ఇలా..

కరోనా వైరస్​ను గుర్తించడానికి, వైరల్​ బయోమార్కర్స్​ను పెంచాల్సి ఉంటుంది. అంటే జన్యుపదార్థాల కాపీలను పెంచాలి. దీనికోసం పాలిమరైజ్ చైన్​ రియాక్షన్​(పీసీఆర్​) లేదా ఏ జన్యుపదార్థాన్నైతే గుర్తించాలనుకున్నమో దానికోసం బైండింగ్​ సిగ్నల్​ను పెంచాలి.

కరోనా ఫలితం కోసం రివర్స్​ ట్రాన్స్​క్రిప్షన్​ పాలిమరైజ్​ చైన్​ రియాక్షన్​(ఆర్​టీ-పీసీఆర్​) పరీక్షే ఉత్తమం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ప్రదేశాన్నిబట్టి, వైరస్​ నమూనాల్ని పంపించడాన్ని బట్టి ఫలితం ఆలస్యం అవుతోంది.

ఈ కొత్త పద్ధతి ద్వారా సమయం వృథా కాదని యూనివర్సీటీ ఆఫ్​ ఫ్లోరిడాలోని కెమికల్​ ఇంజనీర్​ మింగాన్​ షియాన్​ తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా పరీక్షల్లో మరోసారి భారత్​ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.