ETV Bharat / international

కరోనా అంత ప్రమాదకరమా? గాల్లో అన్ని గంటలు ఉంటుందా?

కరోనా వైరస్​ వ్యాప్తిపై ప్రపంచమంతా భయాందోళనతో ఉంది. ఈ వైరస్​ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు జాగ్రత్తలు వహిస్తున్నారు ప్రజలు. అయితే ఈ మహమ్మారి గాల్లో ఎంతసేపు ఉండగలదు? గత వైరస్​లకంటే ఎంతప్రమాదకరం? వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైన విషయాలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి.

new-coronavirus
కరోనా అంత ప్రమాదమా? గాల్లో అన్ని గంటలు ఉంటుందా?
author img

By

Published : Mar 18, 2020, 11:57 AM IST

వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) గాల్లో, బయటి ఉపరితలాలపై మనుగడ సాగిస్తుందా? లేదా?. దీనిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికాలో జరిపిన ఓ అధ్యయనం మాత్రం ఈ వైరస్‌ గాల్లో, ఉపరితలాలపై కొన్ని గంటలపాటు జీవించగలదని చెబుతోంది. మానవ శరీరం వెలుపల జీవించడంలో గతంలో వచ్చిన సార్స్‌కు ఉన్న సామర్థ్యమే దీనికి కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బహుశా ఈ కారణం వల్లే సార్స్‌ కంటే కూడా కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’(సీడీసీ), కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలను న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌(ఎన్‌ఈజేఎం)లో ప్రచురించారు.

పరిశోధన విధానంపై విమర్శలు

కార్ట్‌బోర్డ్‌పై 24 గంటలు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌పై రెండు, మూడు రోజుల వరకు ఈ వైరస్‌ జీవించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీరు జరిపిన పరిశోధనా విధానంపై విమర్శలు వస్తున్నాయి. వీరు మనిషి దగ్గు లేదా తుమ్మడాన్ని అనుకరించేందుకు నెబ్యులైజర్‌ను వాడారు. నెబ్యులైజర్‌ ద్వారా సృష్టించిన కృత్రిమ దగ్గు లేదా తుమ్ము ఓ మానవుని సాధారణ దగ్గు, తుమ్ముతో ఎలా పోల్చగలమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారం కిందే ఈ పరిశోధనా ఫలితాలు ఓ వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యాయి. అప్పటి నుంచి వీరి పరిశోధనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

కరోనా వైరస్‌కు, సార్స్‌కు దాదాపు ఒకే తరహా లక్షణాలున్నాయన్న తాజా పరిశోధనను కూడా కొంతమంది కొట్టిపారేస్తున్నారు. అదే నిజమైతే మరణాల రేటు సార్స్‌తో పోలిస్తే కరోనా వైరస్‌ విషయంలో ఎందుకు స్వల్పంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. సార్స్‌ 8000 మందికి సోకితే 800 మంది మృతిచెందగా.. కరోనా వైరస్‌ రెండు లక్షల మందికి సంక్రమిస్తే దాదాపు 8000 మంది చనిపోయారని గుర్తుచేస్తున్నారు. అయితే దీనికి ఇతర కారణాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి..

అయితే, కరోనా వైరస్‌ గాల్లో, బయటి ఉపరితలాలపై ఎంత సేపు మనుగడ సాగించగలదన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇతర వ్యక్తుల నుంచి కనీస దూరం పాటించడం, గుంపులుగా గుమిగూడకపోవడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, కళ్లు, చెవులు, ముక్కును తాకకుండా ఉండడాలన్న వైద్యుల సూచనల్ని మాత్రం తప్పకుండా పాటించాలని ఈ పరిశోధనలు తేలుస్తున్నాయి.

ఇదీ చూడండి: కరోనా పుట్టినిల్లు సేఫ్- రెండో రోజూ ఒక్కటే కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.