ETV Bharat / international

'కరోనా చికిత్సకు 69 ఔషధాలు గుర్తింపు!' - 'Nearly 70 drugs that may be effective against COVID-19 identified'

ప్రపంచాన్నే కలవరపెడుతున్న కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ కనుగొనే ప్రయత్నాలు రోజురోజుకూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు బలిగొన్న ఈ మహమ్మారికి వైద్య నిపుణలు ఇంకా విరుగుడు మందు కనిపెట్టలేదు. అయితే క్యాన్సర్​, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు వినియోగించే దాదాపు 69 ఔషధాలు.. కరోనా చికిత్సలో మెరుగ్గా పనిచేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు అమెరికా శాస్త్రవేత్తలు.

'Nearly 70 drugs that may be effective against COVID-19 identified'
కరోనా చికిత్సలో దాదాపు 70 ఔషధాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి
author img

By

Published : Mar 26, 2020, 4:03 PM IST

Updated : Mar 26, 2020, 5:02 PM IST

కరోనా వైరస్​ చికిత్సలో 69 డ్రగ్స్​ మెరుగ్గా పనిచేస్తున్నట్లు భారతీయులతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. వీటిలో కొన్నింటిని క్యాన్సర్,​ డయాబెటిస్(మధుమేహం)​, హైపర్​టెన్షన్(రక్తపోటు)​ వంటి వ్యాధులకు ఔషధాలుగా ఇప్పటికే వినియోగిస్తున్నట్లు గుర్తుచేసింది. అలాగే కొవిడ్​-19 చికిత్సకు కొత్త వ్యాక్సిన్​ కనుగొనడం కంటే వేగంగా వీటినే పునర్వినియోగించొచ్చని అంటోంది. ఈ మేరకు ప్రీ-ప్రింట్​ వెబ్​సైట్​ బయోఆర్​ఎక్సివ్​లో ఓ అధ్యయనం ప్రచురించింది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో(యూసీఎస్​ఎఫ్​) వైద్య పరిశోధకుల బృందం. భారత్​కు చెందిన అద్వైత్​ సుబ్రమణియన్​, శ్రీవాస్త్​ వెంకటరమణన్​, జ్యోతి బాత్రా ఈ వైద్య బృందంలో భాగంగా ఉన్నారు.

కరోనా వైరస్​లో వైరల్​ ప్రొటీన్స్​ను ప్రత్యక్షంగా ఉత్పత్తి చేసే 29 సార్స్​-సీఓవీ-2 జీన్స్​లోని 26 జీన్స్​పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. మానవ శరీరంలోని దాదాపు 332 ప్రొటీన్లు సార్స్​-సీఓవీ-2 వైరల్​ ప్రొటీన్లతో అనుసంధానమవుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 4.7లక్షల మందికిపైగా ఈ మహమ్మారి బారిన పడటానికి, 21వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రొటీన్లే కారణమవుతున్నట్లు గుర్తించారు. కరోనాలోని కొన్ని వైరస్​ ప్రొటీన్లు మనిషిలోని ఒకే ప్రొటీన్​పై ప్రభావం చూపుతుండగా.. మరికొన్ని మాత్రం డజన్ల కొద్దీ మానవ ప్రొటీన్లపై ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

" మా వైద్య బృందం సరికొత్త పద్ధతి ద్వారా ఈ అధ్యయనం చేసింది. సార్స్​-సీఓవీ-2 వైరల్​ ప్రొటీన్లపై కాకుండా, హోస్ట్​ ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని పరిశోధన చేశాం. ఈ 29 వైరల్​ ప్రొటీన్లలోని 26 ప్రొటీన్లతో మానవ కణాల్లోని ఏఏ ప్రొటీన్లు అనుసంధానం అవుతున్నాయో గుర్తించేందుకు ఇలా చేశాం.

దురదృష్టవశాత్తు వైద్యలకు సార్స్​-సీఓవీ-2 ఇన్​ఫెక్షన్​ పరమాణు వివరాలపై తక్కువ అవగాహన ఉంది. ప్రస్తుతం మానవ శరీరంలో కరోనా ప్రొటీన్లతో అనుసంధానించే ప్రొటీన్లపై ప్రభావం చూపే 69 డ్రగ్స్​ను గుర్తించాం. వీటిలో 25 ఔషధాలకు అమెరికా ఆహార,ఔషధ యంత్రాంగం(ఎఫ్​డీఏ) ఆమోదం తెలిపింది. అతి త్వరలోనే వీటిని వినియోగంలోకి తెస్తాం."

- ఎన్​గుయాన్​, పరిశోధనా బృందంలోని శాస్త్రవేత్త

ప్రస్తుతానికి కరోనాను పూర్తిగా అరికట్టే వ్యాక్సిన్​ గానీ యాంటీవైరల్ డ్రగ్​ గానీ అందుబాటులో లేదు.

ఇదీ చదవండి : కేంద్రం 'కరోనా ప్యాకేజీ'తో మీకు కలిగే లాభాలివే....

Last Updated : Mar 26, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.