"ప్రపంచం నన్ను ఎప్పటికీ మర్చిపోదు"... అమెరికాలోని నాష్విల్లో ఇటీవల ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఆంటోనీ క్విన్ వార్నర్ ఘటనకు కొద్ది రోజుల ముందు చేసిన వ్యాఖ్యలివి. ఈ విషయాన్ని అతడి పొరుగు ఇంటి వ్యక్తి రిక్ లౌడ్ వెల్లడించారు.
"డిసెంబరు 21న వార్నర్ అతని ఇంటి పోస్ట్ బాక్స్ వద్ద ఉండగా నేను వెళ్లి పలకరించాను. అతని తల్లి క్షేమసమాచారాలు తెలుసుకున్నాక ఈ క్రిస్మస్కు నీకు శాంటా ఏమైనా మంచి చేస్తాడా అని అడిగాను. హా అవును.. నాష్విల్, ప్రపంచం నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. వార్నర్‌పై నాకు ఎప్పుడూ అనుమానం రాలేదు."
-రిక్ లౌడ్
అమెరికాలోని టెనెస్సీ రాష్ట్ర రాజధాని అయిన నాష్విల్లో క్రిస్మస్ రోజు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా పదుల సంఖ్యలో భవనాలకు ఆస్తి నష్టం సంభవించింది. నిందితుడు మృతిచెందాడు. అయితే ఈ దాడికి కారణాలేంటో ఇప్పటికీ తెలియలేదు.
ఇదీ చదవండి : బైడెన్ 'శ్వేతసౌధం డిజిటల్ బృందం'లో కశ్మీరీ