ETV Bharat / international

అంతరిక్షంలోకి పర్యటకులు.. నాసా కొత్త ఆలోచన - అంతరిక్ష పరిశోధనా కేంద్రం

అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారికి నాసా అవకాశం కల్పిస్తోంది. నాసా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించనుంది. ఈ నేపథ్యంలో రోదసిలోకి వెళ్లాలనుకునే ఔత్సాహిక పర్యటకులను అంతరిక్ష కేంద్రంలోకి అనుమతించనుంది.  2020లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పర్యటకులు ఒక రాత్రికి చెల్లించాల్సిన ఖర్చెంతో తెలుసా అక్షరాలా భారత కరెన్సీలో 25 లక్షలు.

అంతరిక్షంలోకి పర్యటకులు.. నాసా కొత్త కార్యక్రమం
author img

By

Published : Jun 8, 2019, 7:01 AM IST

Updated : Jun 8, 2019, 5:37 PM IST

పరిశోధనలతోనే కాదు.. వ్యవహార శైలితోనూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. తాజాగా అంతరిక్షంలోకి పర్యటకులను పంపించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించనుంది. 2020 నుంచి అంతరిక్ష కేంద్రంలోకి ఔత్సాహిక పర్యటకులను అనుమతించనుంది. ఈ పర్యటన ద్వారా వచ్చే ధనాన్ని అంతరిక్ష కేంద్రానికి ఖర్చు చేసేందుకు సంకల్పించింది.

ఇందులో సంవత్సరానికి రెండు పర్యటనలుంటాయి. ఒక్కో పర్యటన 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఏటా 12మంది అంతరిక్ష కేంద్రంలో గడపవచ్చు. ఒక్కో పర్యటకుడు ఒక రాత్రికి 35వేల అమెరికన్ డాలర్ల (సుమారు 25 లక్షలు) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వారి సొంత ఖర్చులు మినహాయింపు. భోజనం, మంచినీళ్లు వంటివి తమ సొంత ఖర్చుతోనే కొనుగోలు చేయాలి. పర్యటకులను అంతరిక్ష కేంద్రానికి చేర్చేందుకు రెండు అంతరిక్ష నౌకలను సిద్ధం చేస్తోంది నాసా. ఒకటి స్పేస్ ఎక్స్ కాగా మరొకటి బోయింగ్.

"వాణిజ్య అవకాశాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించుకునేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇంతకు ముందెప్పుడు లేని విధంగా నాసా ఈ నిర్ణయం తీసుకుంది."

జెఫ్ డి విట్, నాసా ముఖ్య ఆర్థిక అధికారి

ఇంతకు ముందు అంగారక గ్రహంపైకి 2020లో పంపనున్న ఇన్​సైట్ రోవర్లో 20 లక్షల మంది పేర్లను పంపిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఆ పేర్లను తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: అమెజాన్​ 'డెలివరీ డ్రోన్లు' వచ్చేస్తున్నాయ్​...!

New Delhi, June 07 (ANI): While reacting on a question over Congress MLAs request of merger with the TRS, Congress leader Abhishek Manu Singhvi said that whatever happened in Telangana was possible due to money power and the party condemn it. He said, "A political policy has been followed in Telangana since past one year of direct purchase. It's an unfortunate context but if there's such commercialisation, it's the negative aspect of it. All that happened in Telangana was possible due to money power. We condemn it but it is the reality of the new pattern brought in by the ruling party and the Chief Minister there."A group of 12 Congress MLAs gave Telangana Assembly Speaker a representation to merge Congress Legislature Party (CLP) with Telangana Rashtra Samithi (TRS).
Last Updated : Jun 8, 2019, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.