భారత సంతతికి చెందిన భవ్యా లాల్.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)లో ముఖ్యమైన పదవికి ఎంపికయ్యారు. ఈ సంస్థ తాత్కాలిక 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా నియమితులయ్యారు.
ఆమె ఇప్పటికే జో బైడెన్ అధికార మార్పిడి బృందంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమెకు ఇంజినీరింగ్, అంతరిక్ష పరిజ్ఞానంలో అపార అనుభవం ఉందని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది.
అనుభవజ్ఞురాలు..
2005 నుంచి 2020 వరకూ 'ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ అనాలిసిస్'లో పరిశోధన అధికారిగా పనిచేసినప్పుడు విస్తృత సేవలు అందించారని వివరించింది.
ఇదీ చూడండి: భారతీయ అమెరికన్ల వార్షికాదాయం ఎంతంటే...