ETV Bharat / international

భూమి మీదుగా భారీ గ్రహశకలం ప్రయాణం- ఎప్పుడో తెలుసా?

ఈ నెల 21న భూమి మీదుగా ఓ భారీ శకలం ప్రయాణించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.  20 ఏళ్ల క్రితం కనుగొన్న ఆ శకలం సుమారు 3 వేల మీటర్ల వ్యాసంతో ఉంటుందని పేర్కొంది.

author img

By

Published : Mar 12, 2021, 10:48 AM IST

Updated : Mar 12, 2021, 11:51 AM IST

nasa america news it is saying that huge celestial bodies coming towards earth
భూమి మీదుగా ప్రయాణించనున్న భారీ గ్రహశకలం

ఈ నెల 21న భూమి మీదుగా ఓ భారీశకలం ప్రయాణించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. 2001 ఎఫ్​ఓ32గా పిలిచే ఆ గ్రహశకలం వ్యాసం 3 వేల మీటర్లుగా ఉంటుందని చెప్పిన నాసా.. 20 ఏళ్ల క్రితం దానిని గుర్తించినట్లు వెల్లడించింది. భూమికి 2 మిలియన్ కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ గ్రహశకలం ప్రయాణిస్తుందని చెప్పింది.

గ్రహశకలం ప్రయాణించేటప్పుడు అంతరిక్ష పరిశోధకులు దానిని నిశితంగా పరిశీలించేందుకు వీలు చిక్కుతుందని నాసా తెలిపింది. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ శకలం మార్గం కచ్చితత్వంతో ఉందని చెప్పింది. భూమికి ఈ గ్రహశకలానికి ఉండే దూరం చంద్రునికి భూమికి మధ్య ఉన్న దూరానికి ఐదింతలను నాసా వివరించింది. భూమి మీదుగా ఆ గ్రహ శకలం పయనించే సమయంలో గంటకు 77 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని నాసా వెల్లడించింది.

ప్రస్తుతానికి ఆ శకలం గురించి కొద్ది సమాచారమే ఉందని.. మార్చి 21న మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని నాసా చెప్పింది. ఆ శకలంపై సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందిన సమయంలో వెలువడే కాంతి రేఖల ఆధారంగా ఆ శకలంపై ఉన్న ఖనిజాల రసాయన ధర్మాలను విశ్లేషించవచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మార్స్​పై గాలి శబ్దాలు రికార్డు చేసిన నాసా రోవర్

ఆవాసం కోసం అన్వేషణ- కుజ గ్రహంపై 'పెర్సెవరెన్స్‌'

Last Updated : Mar 12, 2021, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.