ETV Bharat / international

'నానోస్పాంజెస్'​తో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట! - సంక్రమణ

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్న కరోనా వైరస్​ను అడ్డుకునే దిశగా కీలక పురోగతి సాధించారు యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా పరిశోధకులు. శరీరంలో కరోనా వైరస్​కు ఆతిథ్యమిచ్చే కణాలను ఆకర్షించి, అంతమొందించే 'నానోస్పాంజెస్​' అనే కృత్రిమ కణాల్ని అభివృద్ధి చేశారు. 90 శాతం వైరస్​ సంక్రమణను ఇది తగ్గిస్తుందని భావిస్తున్నారు.

Nanosponges Could Intercept Coronavirus Infection
'నానోస్పాంజెస్'​తో కరోనా సంక్రమణకు అడ్డుకట్ట!
author img

By

Published : Jun 19, 2020, 5:02 PM IST

ప్రాణాంతక కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకునే దిశగా కీలక పురోగతి సాధించారు యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా పరిశోధకులు. నానోస్పాంజెస్​ అనే కృత్రిమ కణాల్ని అభివృద్ధి చేశారు. ఇది యాంటీవైరల్​ డ్రగ్​ మాత్రం కాదు. కానీ.. కొవిడ్​ను అడ్డుకుంటుందట.

ఈ నానోస్పాంజెస్​... సార్స్​-కొవ్​-2 వైరస్​కు ఆతిథ్యమిచ్చే కణాలను ఆకర్షించి తటస్థీకరిస్తుందని పరిశోధనలో తేల్చారు. వైరస్​ హోస్ట్​ సెల్స్​ను దాడి చేసి.. పునరుత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందట. దాదాపు 90 శాతం వైరస్​ సంక్రమణను అడ్డుకుంటుందని నమ్మకంగా చెబుతున్నారు.

ఈ నానోస్పాంజెస్​ను శాన్​ డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా ఇంజినీర్లు అభివృద్ధి చేయగా... బోస్టన్​ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలు జరిపారు.

ఆతిథ్య కణాలే టార్గెట్​...

వైరస్​కు ఆతిథ్యమిచ్చే ఊపిరితిత్తులు, రోగ నిరోధక వ్యవస్థ పొరలపై ఈ నానోపార్టికల్స్​(చిన్న చిన్న కణాల)ను కప్పి ఉంచేలా మానవ శరీరంలోకి పంపిస్తారు. ఈ ఒక్కొక్క నానోస్పాంజ్​ వెంట్రుక పరిమాణం కంటే వెయ్యిరెట్లు సూక్ష్మంగా ఉంటుంది. ఇంకా బ్యాక్టీరియాతో నశింపజేసేలా ఉండే చిన్న చిన్న కణాలు ఊపిరితిత్తులు, కణాలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఈ నానోస్పాంజెస్​ను ప్రమాదకర వ్యాధికారక క్రిములు, వైరస్​ను పీల్చివేసే విధంగా అభివృద్ధి చేశారు. రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ఉంటుందో లేదో తెలుసుకునేందుకు సుదీర్ఘంగా ప్రయోగాలు జరిపి విజయవంతం అయ్యారు.

దశాబ్దాలుగా అధ్యయనం..

శాన్​ డియాగో ప్రొఫెసర్​ లియాంగ్​ఫంగ్​ ఝాంగ్​.. దశాబ్దకాలంగా ఈ నానోస్పాంజెస్​ గురించి పరిశోధనలు సాగిస్తున్నారు. కరోనా వైరస్​ శరీరంలోకి ప్రవేశించగానే.. దానిని టార్గెట్​ చేసేలా ఏదైనా సృష్టించాలనుకున్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో.. లోతైన పరిశోధనలు చేసి అభివృద్ధి చేశారు. బోస్టన్​ యూనివర్సిటీలో పలు దశల్లో ప్రయోగాలు జరిపగా.. ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీనితో కరోనా.. తన 90 శాతం సాంక్రమికతను కోల్పోతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఝాంగ్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.