న్యూయార్క్లో నేడు జరగనున్న ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత ప్రభుత్వ లక్ష్యాలు, విపత్తును ఎదుర్కోగల మౌలిక సదుపాయాల కోసం ప్రపంచ దేశాలు ఏకం కావాల్సిన అవసరం వంటి అంశాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు మోదీ.
తొలి వ్యాఖ్యాతల బృందంలో..
ఐరాస సదస్సు ప్రారంభ వేడుకలో భాగంగా తొలి వ్యాఖ్యాతల బృందంలోనే ప్రధాని ప్రసంగం ఉండనుంది. ఈ బృందంలో ప్రత్యేకంగా వాతావరణ మార్పులపై ఏదైనా సానుకూల పురోగతి సాధించిన దేశాధినేతలు, మంత్రులను మాట్లాడేందుకు ఆహ్వానించారు.
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్, మార్షల్ ఐలాండ్స్ అధ్యక్షుడు హిల్దా హైన్ తర్వాత మోదీ ప్రసంగిస్తారు. తొలి బృందంలోనే ప్రధాని ప్రసంగం ఉంటడం వాతావారణ మార్పులను ఎదుర్కొనే విషయంలో భారతదేశ పాత్ర, సహకారం ప్రాముఖ్యాన్ని తెలియచెబుతోంది.
మోదీ ప్రసంగం అనంతరం జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మార్కెల్ మాట్లాడతారు.
ఇదీ చూడండి: 'ఏటా 5 విదేశీ కుటుంబాలను భారత్కు పంపండి'