ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం టెక్సాస్‌లోని హ్యూస్టన్ నగరానికి చేరుకున్నారు. అగ్రరాజ్య వాణిజ్య, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ క్రిస్టఫర్ ఓల్సన్ సహా పలువురు అధికారులు మోదీకి స్వాగతం పలికారు.
ఆదివారం హ్యూస్టన్‌లో జరగనున్న 'హౌడీ మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకకు సుమారు 50వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వల్ల ఈ 'హౌడీ మోదీ' హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పర్యటనలో ట్రంప్‌తో భేటీకానున్నారు మోదీ. వాణిజ్యం సహా అనేక అంశాలపై అగ్రనేతలు చర్చించనున్నారు. 27న ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసగించనున్నారు మోదీ.
ఇదీ చూడండి:- ప్రధాని మోదీ అమెరికా పర్యటన సాగనుంది ఇలా..