కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో తమ టీకాకు సమర్థంగా పని చేస్తున్నట్లు తుది దశ ఫలితాల్లో తేలిందని మోడెర్నా సంస్థ తెలిపింది. 94 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా టీకా పనిచేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్... అత్యవసర వినియోగం కోసం అమెరికా, ఐరోపా సమాఖ్యను అనుమతి కోరనున్నట్లు తెలిపింది మోడెర్నా.
డిసెంబరులో అమెరికాలో ఫైజర్ సంస్థ టీకాలు వేయడం ప్రారంభించనుంది. ఈ క్రమంలో తమ టీకా కూడా అత్యవసర వినియోగం కోసం అనుమతివ్వాలని కోరనుంది మోడెర్నా.
అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. అమెరికాలో రోజూ లక్షా 60 వేలకు పైనే కేసులు నమోదవగా.. 1400 మంది మరణిస్తున్నారు. ఐరోపా దేశాల్లో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఇదీ చూడండి: మహమ్మారిని దాటి తయారీ రంగంలో చైనా దూకుడు