అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ).. పరిశోధనల కోసం భారత్‌పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపింది. పరిశోధనల నిమిత్తం 20 ఏళ్ల కాలంలో భారత్‌కు 1000 మందికి పైగా విద్యార్థులను పంపినట్లు ఎంఐటీ ప్రొఫెసర్ వెల్లడించారు.
వాషింగ్టన్లో భారత రాయబారి కార్యాలయం, ఎంఐటీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన 'ఎంఐటీ-భారత్' కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు.
"దేశాభివృద్ధిలో భాగంగా పరిశోధనలు, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకుల బృందాలకు భారత్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశంతో భారత సంస్కృతి, చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందుకు ప్రపంచ మేటి కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థలు సాయంగా నిలిచాయి."
-పవన్ సిన్హా, ఎంఐటీ ప్రొఫెసర్
ఈ విధమైన పరిశోధనలు పర్యటనలతో విద్యార్థుల ఆలోచన విధానాలు మారుతాయని జాతీయ జీవరసాయన కేంద్రం ప్రొఫెసర్ షానన్ బి ఒల్సన్ అన్నారు. వివిధ సంస్కృతులు, నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి పనిచేయడానికి ఇది చక్కని వేదిక అని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:అయోధ్య కేసు తీర్పు విజయోత్సవాలపై ఆంక్షలు