వడగాలులు.... అమెరికాలోని కాలిఫోర్నియా ప్రజలకు కరెంట్ కష్టాలు తెచ్చాయి. ఈదురుగాలులు కారణంగా చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడితే కార్చిచ్చు చెలరేగవచ్చన్న భయంతో... విద్యుత్ సరఫరా నిలిపివేసింది పసిఫిక్ గ్యాస్, విద్యుత్ సంస్థ. ఫలితంగా అక్కడి ప్రజలు కొద్ది రోజుల పాటు అంధకారంలో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యుత్ సరఫరా నిలిపివేతతో 34 కౌంటీల్లోని 8లక్షల మందిపై ప్రభావం పడనుంది. వీరంతా కరెంట్ లేకుండా జీవించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాటరీలు, నీళ్ల బాటిళ్లు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.
గతేడాది నవంబర్‌లో ప్యారడైజ్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి 85 మంది మరణించారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ కార్చిచ్చుకు విద్యుత్ తీగలే కారణమని ఆరోపణలు వచ్చాయి. మరోమారు అలా జరగకుండా చూసేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది పసిఫిక్ గ్యాస్, విద్యుత్ సంస్థ. కరెంట్ కోత ఎన్ని రోజులు కొనసాగుతుందన్నదానిపై స్పష్టత లేదు.
ఇదీ చూడండి : యాపిల్‌కు చైనా తీవ్ర హెచ్చరిక- కారణం ఒక పాట, ఒక యాప్!