ETV Bharat / international

కూలిన మిలటరీ శిక్షణ విమానం

అమెరికాలో శిక్షణ విమానం కూలిపోయింది. అలబామా రాష్ట్రంలోని మోంట్గోమెరిలోని డాన్నెల్లీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంలో ఎంతమంది ఉన్నారు, పైలెట్ల పరిస్థితి గురించి తెలియదన్నారు.

author img

By

Published : Feb 20, 2021, 11:17 AM IST

Military training jet crashes in woods near Alabama airport
కూలిన మిలటరీ శిక్షణ విమానం

అమెరికాలోని అలబామా ఎయిర్​పోర్టకు సమీపంలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. అయితే అందులో ఎంత మంది ఉన్నారన్నదని తెలియదని వైమానిక అధికారులు తెలిపారు. పైలెట్ల పరిస్థితి గురించి కూడి ఇంకా తెలియలేదని వెల్లడించారు.

శిక్షణలో భాగంగా కొలంబియా ఎయిర్​ ఫోర్స్​కు చెందిన టీ-38 శిక్షణ ఎయిర్​ క్రాప్ట్​.. అలబామాలోని మోంట్గోమెరిలోని డాన్నెల్లీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు కూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

కొలంబియా ఎయిర్​ ఫోర్స్​ బేస్​లోని 14వ వైమానిక శిక్షణ కోసం టీ-38 విమానాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మంచుతుపాను బీభత్సం- అంధకారంలో టెక్సాస్​ నగరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.