Michigan plane crash: అమెరికా మిషిగన్‌లో జరిగిన విమాన ప్రమాదాన్ని జయించిన లానీ పెర్డూ అనే పదకొండేళ్ల బాలిక ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయింది. నవంబర్ 13న బీవర్ ఐలాండ్‌లో జరిగిన ప్రమాదంలో లానీ తండ్రి మైక్ పెర్డూ సహా నలుగురు మరణించారు. బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది.
Girl surviving plane crash:
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లానీని గ్రాండ్ రేపిడ్స్లోని మేరీ ఫ్రీబెడ్ పునరావాస ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు బాలిక కోలుకునేందుకు సహకరించారు. తొలుత లానీ నడవలేకపోయిందని, వీల్ ఛైర్లోనే తిప్పామని వైద్యులు తెలిపారు. ఇప్పుడు చేతి కర్రల సాయంతో నడుస్తోందని చెప్పారు.
US news Telugu:
మిషిగన్, న్యూయార్క్, మిన్నెసొటా నుంచి లానీకి గ్రీటింగ్ లెటర్లు వస్తున్నాయని బాలిక తల్లి క్రిస్టీ పెర్డూ చెప్పారు. త్వరగా కోలుకోవాలని అనేక మంది విద్యార్థులు లేఖలు పంపించారని తెలిపారు. ప్రమాదం నుంచి ఆమె బయటపడటం ఓ అద్భుతమని చెబుతున్నారు.
ప్రమాదం సమయంలో తన తండ్రి చాకచక్యంగా వ్యవహరించి కాపాడటం వల్లే లానీ జీవించి ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. పైలట్ సైతం ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.
ఇదీ చదవండి: కుప్పకూలిన విమానం.. 'పాప్‌స్టార్' దుర్మరణం