అక్రమ వలసల నియంత్రణపై మెక్సికోతో ఒప్పందం కుదిరిందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యానికి మెక్సికో నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు పెంచబోమని చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు.
-
....stem the tide of Migration through Mexico, and to our Southern Border. This is being done to greatly reduce, or eliminate, Illegal Immigration coming from Mexico and into the United States. Details of the agreement will be released shortly by the State Department. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) June 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">....stem the tide of Migration through Mexico, and to our Southern Border. This is being done to greatly reduce, or eliminate, Illegal Immigration coming from Mexico and into the United States. Details of the agreement will be released shortly by the State Department. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) June 8, 2019....stem the tide of Migration through Mexico, and to our Southern Border. This is being done to greatly reduce, or eliminate, Illegal Immigration coming from Mexico and into the United States. Details of the agreement will be released shortly by the State Department. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) June 8, 2019
"మెక్సికోతో అమెరికా అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం నుంచి ఆ దేశ వస్తువులపై విధించాలనుకున్న సంకాల పెంపును విరమించుకుంటున్నాం. అమెరికా దక్షిణ సరిహద్దు ద్వారా వలసలను నియంత్రించేందుకు మెక్సికో చర్యలు చేపడతామని తెలిపింది. అక్రమ వలసల కట్టడికి ఇది దోహదపడుతుంది. ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. "
-డొనాల్డ్ ట్రంప్ ట్వీట్.
అమెరికాకు మెక్సికో నుంచి అక్రమ వలసలను నియంత్రించకపోతే ఆ దేశ వస్తువులపై సోమవారం నుంచి 5 శాతం సుంకాలను పెంచుతామని ఇది వరకే ప్రకటించారు ట్రంప్. సుంకాల పెంపు ప్రతినెలా పెరుగుతూ 25 శాతం వరకు చేరుకోవచ్చని హెచ్చరించారు. చివరకు... మెక్సికో దిగొచ్చింది.
ఇదీ చూడండి: దొంగను పట్టుకోవడానికి వెళితే జింక దొరికింది..!