ETV Bharat / international

'మీటూ' బిల్లుకు అమెరికా​ కాంగ్రెస్ ఆమోదం

MeToo bill: మహిళలపై లైంగిక వేధింపులకు చెక్​ పెట్టేలా అమెరికన్​ కాంగ్రెస్​.. మీటూ బిల్లుకు ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జో బైడెన్ ఈ బిల్లుపై సంతకం చేస్తే అమలులోకి రానుంది. గతంలో వెలుగు చూసిన మీటూ ఉద్యమంలో ఈ బిల్లు కీలక మలుపుగా మారనుంది.

MeToo bill
మీటూ బిల్లు
author img

By

Published : Feb 11, 2022, 10:13 AM IST

MeToo bill: మహిళల లైంగిక వేధింపులకు సంబంధించిన బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్​ గురువారం ఆమోదం తెలిపింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధిపులను ఎదుర్కొనే మహిళలు ఎవరైనా సరే కోర్టులను ఆశ్రయించేలా బిల్లును రూపొందించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఈ బిల్లుపై సంతకం చేసిన తరువాత ఇది చట్టంగా అమలులోకి రానుంది. ఈ బిల్లుకు ఆమోదం తెలపడం మీటూ ఉద్యమానికి సంబంధించి కీలక ఘట్టంగా మద్దతుదారులు చెప్తున్నారు.

ఇప్పటివరకు లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు చాలా వరకు కోర్టులో కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని యాజమాన్యాలు ఉద్యోగులకు సూచించేవి. లేకపోతే ఉద్యోగస్థులను తొలగించడం లాంటివి చేసేవారు. తాజాగా వచ్చిన ఈ బిల్లుతో మహిళా ఉద్యోగులకు భద్రతతో పాటు కోర్టులకు వెళ్లే హక్కుని ఈ చట్టం కల్పిస్తుంది.

మీటూ ఉద్యమానికి నాయకత్వం వహించిన సెనేటర్ కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ అమెరికన్ చరిత్రలో ఈ బిల్లు ముఖ్యమైన కార్యాలయ సంస్కరణల్లో ఒకటిగా పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి నిర్వహించే మధ్యవర్తిత్వ ప్రక్రియ రహస్యంగా జరగడం పక్షపాతంతో కూడుకున్నదని అన్నారు. ఇది ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కును కాలరాస్తోందని పేర్కొన్నారు. మిలిటరీలో లైంగిక వేధింపులపై గ్లిలి బ్రాండ్​.. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2017లోనే ఈ చట్టాన్ని సేన్ లిండ్సే గ్రాహంతో కలిసి ప్రవేశ పెట్టారు.

అమెరికన్​ కాంగ్రెస్​లో ఈ చట్టానికి ద్వైపాక్షిక మద్దతు లభించింది. దీంతో బిల్లు సెనేట్‌లో ఏకగ్రీవ ఆమోదానికి కారణం అయ్యింది. ఈ బిల్లు అమెరికాలోని సుమారు పది లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. ఈ బిల్లు గురువారం నాడు జరిగిన సభలో 335- 97 ఓట్లతో సభ ఆమోదం పొందింది.

ఫాక్స్ న్యూస్ యాంకర్ గ్రెట్చెన్ కార్ల్‌సన్ ను సీఈఓ రోజర్ ఐల్స్ లైంగికంగా వేధించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన షరతులకు ఒప్పుకోకపోవడం కారణంగా కక్ష సాధింపులో భాగంగా ఆమె కెరియర్​ను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇలాంటి వారికి ఈ చట్టం మద్దతుగా నిలువనుంది.

ఇదీ చూడండి:

అమ్మాయి పుడుతుందని డౌట్.. అబ్బాయిలా మార్చేస్తానని గర్భవతి తలకు మేకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.