అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ శ్వేతసౌధంలో మొదటి మహిళగా తన చివరి ప్రసంగం శనివారం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
"ఏ పని చేసినా ఇష్టంతో చేయండి. కానీ హింస దేనికీ పరిష్కారం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అది సమర్థించే విషయం కాదు. టీకాలు అందేవరకూ జాగ్రత్తలు తీసుకుంటూ.. కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్న వారిని రక్షించండి. మహమ్మారిపై పోరు ఎనలేని కృషి చేసిన అత్యవసర సేవల సిబ్బందికి నా కృతజ్ఞతలు."
-మెలానియా ట్రంప్, అమెరికా మొదటి మహిళ
బీ బెస్ట్..
ప్రసంగంలో భాగంగా మెలానియా బీ బెస్ట్ పేరుతో ఆమె నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ప్రజలు తమ పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు వారి వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అందరూ ఐక్యతతో అమెరికా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సంప్రదాయం బ్రేక్..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సతీమణి మెలానియా ట్రంప్ నడిచారు. ప్రమాణస్వీకారానికి ముందు బైడెన్‌ను శ్వేతసౌధంలోకి ఆహ్వానించడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తే.. ఇప్పుడు మెలానియా కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. జిల్ బైడెన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించకుండానే తన చివరి ప్రసంగం చేశారు. అధ్యక్ష పదవిని చేపట్టే వారిని ప్రస్తుతం పదవిలో ఉన్న వారు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.
ఇదీ చదవండి : వీడ్కోలు లేఖల సంప్రదాయానికి ట్రంప్ స్వస్తి!