ETV Bharat / international

Mehul Choksi: దిల్లీలో దిగగానే చోక్సీ అరెస్ట్​?

author img

By

Published : Jun 2, 2021, 9:12 AM IST

వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీని(Mehul Choksi) భారత్​కు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారత్​ తరపున వెళ్లిన బృందం బుధవారం అక్కడి న్యాయస్థానంలో వాదన వినిపించనుంది. అంతా సవ్యంగా పూర్తయి, అప్పగింత జరిగినట్లయితే దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే చోక్సీని(Mehul Choksi) అరెస్ట్​ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Mehul Choksi  latest update, మెహుల్​ చోక్సీ కేసు
దిల్లీలో అడుగుపెడుతూనే చోక్సీ అరెస్ట్​!

తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీని(Mehul Choksi) మన దేశానికి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మిషన్​ చోక్సీ కింద ప్రత్యేక విమానం తీసుకుని డొమినికా దేశానికి వెళ్లిన 8 మంది సభ్యుల దర్యాప్తు బృందం.. బుధవారం అక్కడి న్యాయస్థానంలో జరిగే విచారణలో తన వాదన వినిపించనుంది. చోక్సీ(Mehul Choksi) డొమినికా పౌరుడు కాదనీ, అందువల్ల ఆ దేశానికి చెందిన వారికి ఉన్న ప్రాథమిక హక్కులు అతనికి ఉండవని మన బృందం చెప్పనుంది.

అంతా సవ్యంగా పూర్తయి, అప్పగింత జరిగినట్లయితే దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెడుతూనే చోక్సీని(Mehul Choksi) అరెస్ట్​ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సీబీఐ, ఈడీ, సీఆర్​పీఎఫ్​లకు చెందినవారు దర్యాప్తు బృందంలో ఉన్నారు. బ్యాంకు అవకతవకల కేసులపై దర్యాప్తు నిమిత్తం సీబీఐలో ఉన్న విభాగానికి నేతృత్వం వహిస్తున్న శారదా రౌత్​ ఈ బృందంలో కీలక సభ్యురాలు.

ఇదీ చదవండి : Mehul Choksi: 'ఛోక్సీని భారత్​కు అప్పగించండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.