ETV Bharat / international

మాస్కులు, చేతి తొడుగులు కరోనాను ఆపలేవు! - కరోనావైరస్ భద్రత

మాస్కులు, చేతి తొడుగులు కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థమంతంగా ఆపలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు స్పష్టం చేశారు. నిపుణుల సలహాలను పాటించకుండా వీటిని తప్పుడు మార్గాల్లో వాడితే తిరిగి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.

మాస్కులు, చేతి తొడుగులు కరోనాను ఆపలేవు!
మాస్కులు, చేతి తొడుగులు కరోనాను ఆపలేవు!
author img

By

Published : Mar 18, 2020, 1:31 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని మాస్కులు, చేతి తొడుగులు ఆపలేవని, వీటికి చాలా పరిమితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు తేల్చి చెప్పారు. జనసందోహం ఎక్కువగా ఉన్న చోట వీటిని ధరించడం వల్ల ఉపయోగం లేకపోగా, వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

కరోనా విజృంభణతో ఇటలీ, స్పెయిన్​, తాజాగా ఫ్రాన్స్ పూర్తిగా స్తంభించిపోయాయి. అయినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్ నివారణ కోసం తాము మొదట్నుంచి చేస్తున్న సూచనల్లో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు.

"కరోనా వ్యాప్తి నివారణకు.. మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని తాకొద్దు. ఇతరుల నుంచి కొంచెం దూరంగా ఉండాలి. మీకు వైరస్​ సోకినట్లు భావిస్తే, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించండి. లేదంటే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండటం మంచిది."

- మైక్ ర్యాన్​, డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్​

సలహాలు పాటించకపోతే ఎలా?

కరోనా వైరస్ సహజంగా చర్మ స్పర్శ, శ్లేష్మం, చెవులు, కళ్లు, ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. అయితే చాలా మంది నిపుణుల సూచనలు పాటించరు. అందువల్ల వారు మాస్కులు ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

మాస్కులు, గ్లోవ్స్ ధరించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గాలిని ఫిల్టర్ చేసేలా చూసుకోవాలి. ఒకసారి ధరించిన తరువాత వాటిని పదేపదే తాకకూడదు.

ఒక వేళ వైరస్ ఉన్న వాళ్లు మాస్కులు ధరిస్తే, ఆ వైరస్ కాస్తా మాస్కుల్లోకి చేరుతుంది. ఫలితంగా అది సదరు వ్యక్తిని మరింత అనారోగ్యానికి గురిచేస్తుంది.

89 మిలియన్ మాస్కులు అవసరం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం... ప్రతి నెలా సుమారుగా 89 మిలియన్ మాస్కులు అవసరమవుతాయని డబ్ల్యూహెచ్​ఓ అంచనా వేసింది.

కానీ సామాన్య ప్రజలు అవగాహన లేకుండా మాస్కులు వాడుతుండడం వల్ల వైద్య నిపుణులకు కావాల్సిన మాస్కుల కొరత ఏర్పడుతోందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనా వార్: అమెరికన్ పాత్రికేయులపై చైనా వేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.