అమెరికాలోని దక్షిణ కరోలినాలో దారుణం జరిగింది. సెయింట్ మాథ్యూస్‌లోని ఇంట్లో ఓ వ్యక్తి అతని భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తరువాత అతను అదే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు.
కాల్పులు జరిపే సమయంలో పిల్లలు ఇంటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.