అమెరికా జార్జియాలోని ఓ పౌల్ట్రీ ప్లాంట్లో లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పలువురు అస్వస్థతకు గురికాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈశాన్య జార్జియాలోని గైనెస్విల్లో ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల తర్వాత ప్రైమ్ పాక్ ఫుడ్స్ కర్మాగారంలో ఈ లీకేజీ ఏర్పడినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన నలుగురు సిబ్బంది సైతం గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.