ETV Bharat / international

'చైనాను కట్టడి చేసేందుకు 'క్వాడ్'​లో చేరాం' - america about quad in india

చైనాతో సరిహద్దు ఉద్రక్తతల నేపథ్యంలో భారత్​ తమ రక్షణాత్మక అవసరాల్లో ఇతర దేశాల సహకారం ఎంత అవసరమో తెలుసుకుందని యూఎస్​-ఇండో పసిఫిక్​ కమాండ్​ కమాండర్​​ అభిప్రాయపడ్డారు. హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్‌ క్వాడ్‌లో భాగస్వామిగా మారిందని పేర్కొన్నారు.

america about quad in india
'ఇతర దేశాల సహకారం గురించి భారత్ తెలుసుకుంది​'
author img

By

Published : Mar 10, 2021, 10:28 AM IST

వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమ రక్షణాత్మక అవసరాలకు ఇతర దేశాల సహకారం ఎంత అవసరమో భారత్ తెలుసుకుందని యుఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ కమాండర్.. ఫిల్ డేవిడ్సన్ అన్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు.

"భారత్ చాలాకాలంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానాన్ని కలిగి ఉంది. చైనాతో నెలకొన్న సంక్షోభం సమయంలో.. భారత్ కు కొన్ని వస్తువులు అందించాం. కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంచుకున్నాం. హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్‌ క్వాడ్‌లో భాగస్వామిగా మారింది. ఈ చర్య ఇతర దేశాలకు సహాయపడనుంది."

-ఫిల్ డేవిడ్సన్, యుఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ కమాండర్.​

అమెరికా ప్రయోజనాలను అణగదొక్కేందుకు డ్రాగన్ దేశం మీడియాను ఎగదోస్తుందని కమాండర్ అడ్మిరల్ ఆరోపించారు.

ఇదీ చూడండి:ఈ నెల 12న ఒకే వేదికపై మోదీ, బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.