ETV Bharat / international

ట్రంప్​తో మూడోసారి భేటీకి సిద్ధం : కిమ్ - donald trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో మూడో భేటీకి సిద్ధమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా సరైన వైఖరితో ముందుకొస్తే మంచిదని ఆకాంక్షించారు. అమెరికా నిర్ణయంపై ఈ ఏడాది చివరివరకు వేచి చూస్తామని స్పష్టం చేశారు కిమ్.

ట్రంప్​తో మూడోసారి భేటీకి సిద్ధం:కిమ్
author img

By

Published : Apr 13, 2019, 4:37 PM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో మూడో భేటీకి సిద్ధమేనని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్ ప్రకటించారు. అమెరికా సరైన వైఖరితో వస్తే భేటీకి అంగీకారం తెలపనున్నట్లు స్పష్టం చేశారు.

అమెరికా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొనేందుకు ఈ సంవత్సరాంతం వరకూ తాను ఎదురుచూస్తానన్నారు కిమ్​. వియత్నాం వేదికగా జరిగిన రెండో భేటీలో ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందమూ జరగలేదు.

పరిమిత అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తర కొరియాపై ఆంక్షలు సడలించాలని కోరినందున ఫిబ్రవరి నెలలో జరిగిన రెండో దశ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అయితే కొంతమేరకు మాత్రమే ఆంక్షలు సడలించాలని కోరామని కొరియా అంటోంది.

వియత్నాంలో జరిగిన రెండో భేటీలో కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి అమెరికా సిద్ధంగానే ఉందా అనే అనుమానం కలిగిందని ఉత్తరకొరియా పార్లమెంట్​నుద్దేశించిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు కిమ్.

అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య మొదటిసారి గతేడాది జూన్​లో సింగపూర్ వేదికగా సమావేశం జరిగింది. ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణపై ఇరు దేశాధ్యక్షులు ఆ సమావేశంలో సూత్రప్రాయ ఒప్పందంపై సంతకం చేశారు. కానీ రెండో సమావేశంలోనే భవిష్యత్​ పురోగతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

"మేం మరోసారి ప్రయత్నిద్దామని అనుకుంటున్నాం. ఇరుపక్షాలకు అంగీకారమయ్యే ప్రతిపాదనలతో అమెరికా ముందుకొస్తే మూడో భేటీకి సిద్ధం. ఈ ఏడాది చివరివరకు అమెరికా నిర్ణయం కోసం వేచి చూస్తాం"

-కిమ్ జోంగ్ ఉన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు

కిమ్ ప్రకటనలో ట్రంప్​పై వ్యక్తిగత విమర్శలేమీ చేయలేదు. అమెరికా అధ్యక్షుడి​తో వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతున్నాయని, ఎప్పుడు కావాలంటే అప్పుడు పరస్పరం లేఖలు రాసుకుంటూ ఉంటామని ప్రకటించారు కిమ్.

ఉత్తర కొరియా అధ్యక్షుడితో మూడో సమావేశంపై ఆలోచిస్తున్నట్లు ట్రంప్ గురువారమే ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో సమావేశానికి ముందు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తర కొరియా, అమెరికా మధ్య సమావేశానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ చొరవ తీసుకున్నారు.

ఇదీ చూడండి: దిగ్గజాలు లేని పోరులో గెలుపు ఎవరిది?

AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 13 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0800: Pakistan Protest AP Clients Only 4205874
Relatives of blast victims stage Quetta protest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.