ETV Bharat / international

'జాతీయవాద పులిని రెచ్చగొడుతున్న చైనా'

భారత్​-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించింది అమెరికా మీడియా. సరిహద్దు వెంట ఉద్రిక్తతలు పెంచుతూ భారత జాతీయవాద పులిని చైనా రెచ్చగొడుతోందని విశ్లేషించింది. వాస్తవాధీన రేఖ వెంట దక్షిణ చైనా సముద్రంలో అనుసరించిన వ్యూహాన్నే భారత్​ లక్ష్యంగా అమలు చేస్తోందని పేర్కొంది.

author img

By

Published : Jun 17, 2020, 11:04 AM IST

us media
'భారత జాతీయవాద పులిని చైనా రెచ్చగొడుతోంది'

తాజాగా భారత్​- చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్​కు బాసటగా నిలిచింది అమెరికా మీడియా. సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచుతూ భారత జాతీయవాదాన్ని చైనా రెచ్చగొడుతోందని అభిప్రాయపడింది. వాస్తవాధీన రేఖ వెంట ఇంతకుముందు నెలకొన్న శాంతియుత పరిస్థితులను చెదరగొట్టేలా చైనా బలగాలు ఏకపక్షంగా వ్యవహరించాయని వాషింగ్టన్ ఎగ్జామినర్ పత్రిక తన సంపాదకీయం​లో ప్రచురించింది. సైనిక ఉపసంహరణపై అవగాహనకు వచ్చి ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే.. భారత సైనికులతో చైనా జవాన్లు బాహాబాహీకి దిగడం సరికాదని పేర్కొంది.

"సోమవారం సాయంత్రం జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లను చంపి చైనా సైన్యం.. భారత జాతీయవాద పులిని రెచ్చగొడుతోంది."

-టామ్ రోగన్, కాలమిస్ట్, వాషింగ్టన్ ఎగ్జామినర్​

జాతీయవాదమే ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నట్లు తన వ్యాసంలో నొక్కి చెప్పారు రోగన్. అంతర్గతంగా నెలకొన్న సమస్యల నుంచి జాతీయవాదం, అంతర్జాతీయంగా​ ప్రముఖ స్థానం వైపు భారత ప్రజానీకం చూసేలా దృష్టి మరల్చారని పేర్కొన్నారు. సోమవారం నాటి ఘర్షణ.. మరో సరికొత్త సవాలును మోదీ ముందు నిలిపిందని అభిప్రాయపడ్డారు.

"2019లో పుల్వామాలో జరిగిన దాడి తర్వాత అత్యంత వేగంగా చర్యలు తీసుకున్నారు భారత ప్రధాని. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న అంచనాల మేరకు మోదీ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా వ్యవహరించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం కాదు."

-వాషింగ్టన్ ఎగ్జామినర్​లో రోగన్ అభిప్రాయం

దూకుడు స్వభావం గల అధికారులతో..

'వాస్తవాధీన రేఖ వెంట గత రెండు నెలలుగా ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది చైనా సైన్యం. భారత సరిహద్దును దాటుతూ కవ్విస్తోంది' అని తన వ్యాసంలో పేర్కొన్నారు రోగన్. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ కూడా భారత సరిహద్దు వెంట దూకుడు స్వభావం గల అధికారులను నియమించారని గుర్తుచేశారు. ఈ వైఖరి... చైనా దురాక్రమణ విధానాన్ని బయటపెడుతోందని.. చైనాకు లాభించే ఒప్పందాన్నే భారత్​తో అంగీకరింపజేసే వ్యూహంలా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

దక్షిణ చైనా సముద్రం వ్యూహమే.. భారత్​పై

చైనాతో వ్యవహారంలో భారత్​కు అమెరికా అండగా ఉంటుందని అభిప్రాయపడ్డారు రోగన్. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా దేశాలు దక్షిణ చైనా సముద్రం అంశమై చైనాతో ఎదుర్కొంటున్న రోజువారీ బెదిరింపులే ప్రస్తుతం భారత్​కు అనుభవంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. చైనా ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం అమెరికా నేతృత్వంలో సాగుతూ వస్తోన్న స్వేచ్ఛాపూరిత అంతర్జాతీయ విధానాలకు విఘాతం కలిగిస్తోందని చెప్పారు.

ఇదీ చూడండి: భారత్​ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.