ETV Bharat / international

కమలా హారిస్‌కు అలా పిలిస్తే చాలా ఇష్టమట! - కమలా హారిస్ తల్లి వివరాలు

కమలా హారిస్​.. అమెరికాలోనే కాదు భారత్​లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు. భారత మూలాలున్న ఈమెకు అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అవకాశం లభించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన.. కమలా హ్యారిస్​ తన భారత మూలాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Kamala Harris about india
భారత్​ గురించి కమలా హారిస్​
author img

By

Published : Aug 13, 2020, 12:23 PM IST

అమెరికాలో నవంబర్‌లో జరగనున్న ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు అవకాశం లభించింది. అధ్యక్షపదవి రేసులో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌, తమ పార్టీ తరపు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె.. తొలి ఉపన్యాసంలో తన భారతీయతను గురించి ప్రస్తావించి పలువురిని ఆకట్టుకున్నారు. తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు.

తను 'మోమలా' అనే పిలుపును చాలా ఇష్టపడతానని 55 ఏళ్ల కమలా హారిస్‌ అన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో నిలవటం నిస్సందేహంగా తన కెరీర్లో అతి గొప్పవిషయమని.. అయితే తమ వద్దే ఉంటున్న భర్త, సంతానం కొలే, ఎల్లా తనను రోజూ ఆ విధంగా పిలవటం సంతోషాన్ని పంచుతుందని వివరించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌ అయిన కమల,

"మా తల్లి శ్యామలా గోపాలన్‌ భారత్‌కు చెందిన వారు కాగా, తండ్రి డొనాల్డ్‌ హారిస్ ఆఫ్రికాలోని జమైకాకు చెందినవారు. ప్రపంచంలో భిన్న ప్రదేశాలకు చెందిన నా తల్లితండ్రులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చారు. వారిని 1960 నాటి పౌరహక్కుల ఉద్యమం దగ్గరకు చేర్చింది. మా అమ్మ శ్యామల, అమెరికాలోని ప్రతి తరంవారు ముందుకు నడవాలనే ఆదర్శాన్ని నాకు, నా సోదరి మాయకు నేర్పింది. ఊరికే కూర్చుని రకరకాల అంశాలపై గురించి ఫిర్యాదులు చేసే కన్నా, ఏదో ఒకటి చేసి చూపాలని ఆమె మాకు ఎప్పుడూ చెప్పేవారు" అని వెల్లడించారు.

భారతీయ మూలాలున్న హారిస్‌ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే.. అమెరికా ఉపాధ్యక్షురాలైన తొలి మహిళగా మాత్రమే కాకుండా, ఈస్థాయికి చేరిన భారతీయ మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించనున్నారు.

ఇదీ చూడండి:ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.