జార్జి ఫ్లాయిడ్ కేసు గురించి మాట్లాడటం మానేయకపోతే కేసు విచారణను మరో చోటికి తరలించే అవకాశం ఉందని.. మిన్నెసోటా న్యాయమూర్తి జస్టిస్ పీటర్ కాహిల్ హెచ్చరించారు.
ఫ్లాయిడ్ ముఖంపై మోకాలు పెట్టిన పోలీస్ అధికారి చౌవిన్ (44)పై హత్య కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉండి చౌవిన్కు సహకరించిన.. మరో ముగ్గురు అధికారులు థామస్ లేన్, జే. కుయేంగ్, తౌ థాయ్పైనా కేసులు నమోదు చేసి... విధుల నుంచి తొలగించారు.
చౌవిన్ బృందం తమ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఆత్మరక్షణకు ప్రయత్నించారని.. అందులో జాతి వివక్షేమీ లేదంటూ.. కొందరు పోలీసు అధికారులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు నిరసనలు మొదలెట్టారు. దీంతో, ఈ కేసు గురించి, నిందుతులకు సహకరిస్తూ మాట్లాడితే నిష్పాక్షిక న్యాయం జరగదన్నారు జస్టిస్ కాసిల్. అందుకే, నిందితుల కుటంబసభ్యులు, పోలీసు అధికారులు మీడియా ముందుకు రావద్దని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా పడింది.