తమ సంస్థకు చెందిన ఓ బ్యాచ్ కొవిడ్-19 టీకాలు నాణ్యతా ప్రమాణ పరీక్షల్లో విఫలయ్యాయని జాన్సన్ అండ్ జాన్సన్(జే&జే) వెల్లడించింది. దీంతో వాటిని వినియోగించలేమని బుధవారం తెలిపింది. అయితే ఎన్ని డోసులు కోల్పోయిందీ, భవిష్యత్తు డెలివరీలపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది స్పష్టం చేయలేదు.
ఈ టీకాలను జే&జే కోసం ఎమర్జెంట్ బయోసొల్యూషన్స్ తయారు చేస్తోంది. వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం పెంపునకు జే&జే వినియోగిస్తోన్న 10 సంస్థల్లో ఎమర్జెంట్ ఒకటి. దానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) నుంచి వ్యాక్సిన్ తయారీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం లభించలేదని జేజే వెల్లడించింది.
మార్చి చివరి నాటికల్లా అమెరికాకు 2 కోట్ల డోసులు, మే చివరికల్లా 8 కోట్ల డోసులను అందించాలని జే&జే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి: మార్కెట్కు వెళ్లాలంటే రూ. 5 టోల్ కట్టాల్సిందే!