అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషాలో తనపై కాల్పులు జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడాడు జాకబ్ బ్లేక్. గాయాలైన ప్రాంతంలో తీవ్రమైన నొప్పి ఉందని, నరకయాతన అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్లేక్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు అతని న్యాయాది బెన్ క్రంప్. ఈ వీడియోలో తను పడుతున్న బాధను వెల్లడించారు బ్లేక్.
-
#JacobBlake released this powerful video message from his hospital bed today, reminding everyone just how precious life is. #JusticeForJacobBlake pic.twitter.com/87CYlgPDBj
— Ben Crump (@AttorneyCrump) September 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#JacobBlake released this powerful video message from his hospital bed today, reminding everyone just how precious life is. #JusticeForJacobBlake pic.twitter.com/87CYlgPDBj
— Ben Crump (@AttorneyCrump) September 6, 2020#JacobBlake released this powerful video message from his hospital bed today, reminding everyone just how precious life is. #JusticeForJacobBlake pic.twitter.com/87CYlgPDBj
— Ben Crump (@AttorneyCrump) September 6, 2020
ఇరవై నాలుగు గంటలు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది. నిద్ర పోలేకపోతున్నా. ఏమీ తినరావటం లేదు. ఒక పక్క నుంచి మరో పక్కకి తిరగాలన్నా నొప్పి బరించలేకపోతున్నా. వెనుకవైపు, పొట్ట భాగంలో కుట్లు ఉన్నాయి. నా విధంగా మీ జీవితాన్ని మీ నుంచి తీసుకుంటారు. అందరు కలిసి ఉండండి. మన ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించండి. వారి జీవన విధానాన్ని సులభతరం చేయండి.
- జాకబ్ బ్లేక్, ఆఫ్రో-అమెరికన్.
ఆగస్టు 23న బ్లేక్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కెనోషా పోలీసు అధికారి ఆఫ్రో-అమెరికన్ బ్లేక్ వీపుపై ఏడుసార్లు కాల్పలు జరిపాడు. నడుము నుంచి కింది భాగం మొత్తం చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: జాకబ్ బ్లేక్' ఘటనపై అట్టుడికిన అమెరికా