ETV Bharat / international

'ప్రపంచ దేశాలు భారత్​కు అండగా ఉండాల్సిన సమయం' - UN General Assembly President

భారత్​లో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందన్నారు ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్​ బోజ్​కిర్​. ప్రపంచం మొత్తం ఏకతాటిపైకి వచ్చి భారత్​కు సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.

UN General Assembly President
ఐరాస
author img

By

Published : Apr 28, 2021, 4:35 AM IST

దేశంలో కరోనా ఉద్ధృతిపై ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్​ బోజ్​కిర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా భారత్​కు అండగా ఉండాలని ట్విట్టర్​ ద్వారా పిలుపునిచ్చారు.

" భారత్​లో కొవిడ్​-19 పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్​ ఎంతగానో కృషి చేసింది. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా భారత్​కు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది."

-- వోల్కన్​ బోజ్​కిర్, ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు

ప్రస్తుతం తన ఆలోచనల్లో భారత్ మాత్రమే ఉందన్నారు బోజ్​కిర్. అయితే ఐరాసలో భారత రాయబారి టీ ఎస్ తిరుమూర్తి.. బోజ్​కిర్ ట్వీట్​కు స్పందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు అండగా ఉండటాన్ని భారత్ ప్రశంసిస్తుందన్నారు.

ఇదీ చదవండి : '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.