ETV Bharat / international

సుప్రీంలో బలమైన వాదనలు వినిపించడం కష్టమే: ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై పలు ఆరోపణలు చేసి సుప్రీంను ఆశ్రయించిన డొనాల్డ్ ట్రంప్​ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్​ మోసాలపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించడం తనకు కష్టమేనని అన్నారు.

Trump
సుప్రీంలో బలమైన వాదనలు వినిపించడం కష్టమే: ట్రంప్
author img

By

Published : Nov 30, 2020, 10:05 AM IST

అమెరికా- 2020 అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ మోసాలు, అన్యాయాలపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించడం తనకు క్లిష్టమైన పనేనని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యాయస్థానాలు కనీసం తన వాదనను వినిపించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించబోనని వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు ట్రంప్‌. ఈ నేపథ్యంలో... తన వానదనలకు ఆధారాలు సమర్పించాలని తాము విశ్వప్రయత్నాలు చేస్తున్నా కోర్టు జడ్జిలు మాత్రం కనీసం తమ వ్యాజ్యాలను స్వీకరించడం లేదని వాపోయారు. అయినప్పటికీ తమ న్యాయపోరాటం అగదని, ఇప్పటికే వందల కొద్ది వ్యాజ్యాలు కోర్టుల్లో వేశామని ట్రంప్​ వెల్లడించారు.

'న్యాయ వ్యవస్థలోనే లోపం ఉంది'

న్యాయవ్యవస్థే సరిగ్గా లేదంటూ డొనాల్డ్​ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఆరు నెలల పాటు అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి తన ఆలోచన సరళి మారబోదని చెప్పారు. న్యాయం కోసం తనకున్న శక్తిని 125 శాతం మేర వినియోగిస్తానన్నారు.

ఇదీ చదవండి:కరోనా పంజా: హాంకాంగ్​లో స్కూల్స్​ బంద్​​- ఇరాక్​లో రీఓపెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.