కరోనా మహమ్మారి విషయంలో మరోసారి చైనా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. చైనా నిర్లక్ష్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల సభలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. అధ్యక్షుడిగా తనను మరోసారి ఎన్నుకుంటే అమెరికాను తయారీరంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కొవిడ్‌ను కరోనా అని పిలవటంపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు.
"మనం చరిత్రలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఇప్పుడు మరోసారి ఆ దిశగా వెళుతున్నాం. ఇక చైనా వైరస్ విషయానికి వస్తే.. దీన్ని కరోనా వైరస్ అని పిలువకూడదు. కరోనా అంటే ఇటలీలో అందమైన ప్రాంతం పేరు. అందుకే నేను దీన్ని కరోనా అని కాకుండా చైనా వైరస్ అని పిలుస్తున్నాను."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చూడండి: 'అమెరికా అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర'