ETV Bharat / international

'వైద్య పరికరాలు భారత్​కు చేర్చిన వారి కృషి ప్రశంసనీయం'

కొవిడ్ విపత్కర పరిస్థితుల దృష్ట్యా భారత్​కు వైద్య పరికరాలను సాయంగా అందించింది అమెరికా. నాలుగు విమానాల్లో వైద్య పరికరాలు పంపించింది. అయితే.. ఈ ప్రక్రియలో పాల్గొన్న వారి కృషిని ప్రశంసించారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్.

US aid
అమెరికా విమానం, వైద్య పరికరాలు
author img

By

Published : May 6, 2021, 9:57 AM IST

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో.. అమెరికా పంపిన వైద్య పరికరాలను నాలుగు విమనాల్లో భారత్​కు చేరుకున్నాయి. ఈ వైద్యపరికరాలు భారత్​కు చేరవేయడంలో కృషి చేసినవారందరినీ ట్విటర్ వేదికగా ప్రశంసించారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.

  • So far, we've sent 4 gray tails to India, containing 1m Rapid Diagnostic Tests, 545 Oxygen Concentrators, 1,600,300 N95 masks, 457 Oxygen cylinders, 440 regulators, 220 pulse oximeters and 1 Deployable Ox. Concentration System. It's been a heroic effort from all involved. pic.twitter.com/RJuxJ0KOOf

    — Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇప్పటివరకు మొత్తంగా నాలుగు విమనాల్లో వైద్యపరికరాలు భారత్​కు పంపాం. 1 మిలియన్ రాపిడ్ టెస్టు పరికరాలు, 545 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 16,00,300 ఎన్95 మాస్కులు, 457 ఆక్సిజన్ సిలిండర్లు, 440 రెగ్యులేటర్లు, 220 పల్స్ ఆక్సిమీటర్లు ఇతర వైద్య పరికరాలు పంపించాం."

-- లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి.

అమెరికాకు ధన్యవాదాలు..

అమెరికా చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలిపింది భారత విదేశాంగ శాఖ. అమెరికా సహకారం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేసింది. 1000 ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర వైద్యపరికరాలతో మరో విమానం అమెరికా నుంచి భారత్​ చేరుకోనుందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.

భారత్​కు .. 100 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే వైద్య పరికరాలు సాయం చేసింది అమెరికా.

ఇదీ చదవండి:అమెరికా 'మేధో హక్కుల' నిర్ణయంపై భారత్ హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.