ETV Bharat / international

రోబోతో అణు శాస్త్రవేత్త హత్య- వేల కి.మీ దూరం నుంచి.. - ఫక్రిజాదె హత్య న్యూయార్క్ టైమ్స్

ఇరాన్‌ అణు శాస్త్రవేత్త మొసిన్‌ ఫక్రిజాదె హత్య (Fakhrizadeh Assassination) విషయంలో ఇజ్రాయెల్‌ ప్రణాళిక బాహ్య ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యర్థిని అంగుళం తేడా రాకుండా మట్టుబెట్టింది. గతేడాది జరిగిన ఈ ఘటనపై న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర కథనం రాసింది.

MOSSAD fakhrizadeh OPERATION
ఫక్రిజాదె ఆపరేషన్
author img

By

Published : Sep 21, 2021, 3:55 PM IST

పక్కా ప్లానింగ్‌.. అంగుళం కూడా తేడా రాని గురి.. నిమిషంలో టార్గెట్‌ను మట్టుపెట్టి.. ఒక్క ఆధారం కూడా లభించకుండా అదృశ్యమైపోవడం.. ఇది ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ స్టైల్‌..!

గతేడాది ఇరాన్‌ టాప్‌ న్యూక్లియర్‌ సైంటిస్టు మొసిన్‌ ఫక్రిజాదె హత్య (Fakhrizadeh Assassination) విషయంలో ఇజ్రాయెల్‌ ప్లానింగ్‌ బాహ్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొన్ని వేల కిలోమీటర్ల అవతల నుంచి అంగుళం కూడా తేడా రాకుండా ప్రత్యర్థిని గురిపెట్టి వేటాడింది మొస్సాద్‌..! (Mossad Israel) తాజాగా ఆ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

Fakhrizadeh
మొసిన్‌ ఫక్రిజాదె

అదును కోసం మాటు వేసి..

అణ్వాయుధ తయారీలో యురేనియం ప్రధాన ఇంధనం. భూమి నుంచి వెలికితీసిన రూపంలో దీనిని వాడరు. శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేసి ఆయుధ గ్రేడు యూరేనియం తయారీ కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ పెట్టిన పేరు 'గ్రీన్‌సాల్ట్‌ ప్రాజెక్టు'. దీనినే 'ప్రాజెక్టు1-11' అని కూడా అంటారు. ఇక్కడే క్షిపణుల వార్‌హెడ్‌లను కూడా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ఫక్రిజాదె కీలకమైన వ్యక్తి. ఆయన 14 ఏళ్ల నుంచి ఇరాన్‌ అణ్వాయుధ (Iran Nuclear Weapons) కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయన మొస్సాద్‌ హిట్‌లిస్ట్‌లో ఉన్న విషయం ఇరాన్‌ ఎప్పుడో పసిగట్టింది. దీంతో ఆయనకు దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్స్‌ రక్షణ కల్పించింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును సమకూర్చింది. ఫక్రిజాదెకు ఇవేవీ పెద్దగా ఇష్టంలేదు. చిన్నచిన్న సంతోషాలు తీర్చుకోవడానికి ఆయన చాలా తాపత్రయపడతారు. వారాంతాల్లో కాస్పియన్‌ సముద్రం వద్ద కుటుంబంతో గడపడం.. అబ్సార్డ్‌ అనే ఊళ్లో సమయం గడపడం ఇష్టం. చాలా సార్లు తన నిస్సాన్‌ టియాన కారులో ఎటువంటి భద్రత లేకుండా డ్రైవ్‌కు వెళుతుంటారు. గతేడాది నవంబర్‌ 27వ తేదీ మధ్యాహ్నం తన కారులో అబ్సార్డ్‌ పట్టణానికి బయల్దేరారు. ఫక్రిజాదె డ్రైవింగ్‌ సీట్లో కూర్చోగా.. ఆయన భార్య ప్యాసింజర్‌ సీట్లో కూర్చున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వేరే వాహనాల్లో ఆయన్ను అనుసరించారు.

ఫక్రిజాదె తన గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో ఒక యూటర్న్‌ ఉంది. అదే సమయంలో ఆయన కాన్వాయ్‌లోని ముందు కారు కొంచెం వేగంగా ఫక్రిజాదె దిగాల్సిన ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లిపోయింది. యూటర్న్‌ తీసుకొని పావు మైలు ప్రయాణించాక నిమిషం వ్యవధిలో మూడు విడతలుగా కాల్పులు జరిగాయి. దీంతో కారు డోరు తెరుచుకొని ఆయన రోడ్డుపై పడిపోయారు. ఆయనకు రక్షణగా ఉన్న సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలోనే సమీపంలోని ఒక జామ్యాద్‌ ట్రక్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. తర్వాత ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ వైఫల్యం బయటకు తెలియనీయకుండా దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రచారం జరిగింది.

Fakhrizadeh Assassination
ఫక్రిజాదె ప్రయాణించిన కారు

పక్కా లెక్కతో రోబో..!

ఫక్రిజాదె హత్యకు వాడిన కిల్లర్‌ రోబో తయారీ, తరలింపు విషయంలో ఇజ్రాయెల్‌ పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇజ్రాయెల్‌ ఏదైనా దాడికి పథకం రచిస్తే.. దానిని అమలు చేసిన వారి ప్రాణాలు పోకుండా ఉండేలా చూస్తుంది. దాడిచేసిన ఇజ్రాయెల్‌ ఏజెంట్లు చనిపోతారనుకుంటే అసలు ఆ ప్లాన్నే చెత్తబుట్టలో పారేస్తుంది. ఇరాన్‌కు వెళ్లి అత్యంత భద్రత మధ్య ఉండే ఫక్రిజాదెను అంతం చేయడం ఇజ్రాయెల్‌ ఏజెంట్ల ప్రాణాలకు ముప్పు. దీంతో రోబో, కృత్రిమ మేథను వాడి దాడి చేయాలని నిర్ణయించుకొంది.

దాడి కోసం బెల్జియంలో తయారు చేసిన 'ఎఫ్‌ఎన్‌ మాగ్‌' మిషిన్‌ గన్‌ను ఎంపిక చేసుకొంది. ఈ రైఫిల్‌.. నిమిషానికి 600 తూటాలను కాల్చగలదు. దానికి అత్యాధునిక రోబోటిక్‌ పరికరాలను అమర్చింది. కానీ, ఈ కిల్లర్‌ రోబో బరువు దాదాపు టన్ను వచ్చింది. దీంతో దానిని మొత్తం విడగొట్టి.. వివిధ మార్గాల ద్వారా పలువిడతలుగా ఇరాన్‌లోకి చేర్చి అసెంబ్లింగ్‌ చేసింది.

ఈ రోబోను అమర్చడానికి జామ్యాద్‌ పికప్‌ ట్రక్‌ను ఎంపిక చేసింది. ఎందుకంటే ఇరాన్‌లో ఆ రకం ట్రక్‌లు సర్వసాధారణం. దీనికి పలు దిక్కుల్లో కెమెరాలను అమర్చింది. చుట్టుపక్కల పరిసరాలు కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని వ్యక్తికి తెలియడానికి ఇవి ఉపయోగపడతాయి. ట్రక్‌లో భారీగా పేలుడు పదార్థాలను నింపింది. దీనిని సిద్ధం చేసిన అపరేటర్లు వెంటనే దేశం దాటేశారు.

గురి తప్పకుండా ప్రోగ్రామ్‌..!

ఇక ట్రక్‌పై అమర్చిన రోబో మిషిన్‌ గన్‌ కాల్చే సమయంలో కదులుతుంది. దీంతో తర్వాతి బుల్లెట్లు గురితప్పుతాయి. పైగా ఫక్రిజాదె కారు ప్రయాణిస్తుంటుంది. ఆ రోబో, కెమెరాల నుంచి కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం వెళ్లి.. అక్కడ ఆపరేటర్‌ స్పందన తిరిగి రోబోకు చేరేందుకు కనీసం 1.6 సెకన్ల సమయం పడుతుందని లెక్కగట్టింది. ఈ ఆలస్యాన్ని, కారు వేగాన్ని, గన్‌ కదలికల నుంచి వచ్చే సమస్యలను తప్పించేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ప్రోగ్రామ్‌ చేసింది. దీంతో ఫక్రిజాదె పక్కన కూర్చున్న ఆయన భార్య కూడా ఈ దాడిలో గాయపడలేదు.

ఇక కారులో ఫక్రిజాదె కూర్చున్న సీట్‌ను నిర్ధారించుకొనేందుకు ఒక వాహనంపై కెమెరాను అమర్చింది. దానిని టైర్‌ తొలగించి జాకీపై నిలబెట్టి యూటర్న్‌ వద్ద ఉంచింది. ఆ మార్గంలో ఫక్రిజాదె ప్రయాణించనున్నారు. అక్కడి చిత్రాలను విశ్లేషించి కారులో ఆయన సీటును ఆపరేటర్లు నిర్ధారించుకొన్నారు. అదే సమయంలో ఆ రోడ్డుపై అమర్చిన సీసీకెమెరాలను పనిచేయకుండా చేశారు.

ఆ ఒక్క విషయంలో మొస్సాద్ విఫలం..

హత్య తర్వాత జామ్యద్‌ ట్రక్‌ను పేల్చేసే విషయంలో మొస్సాద్‌ అంచనాలు తప్పాయి. ట్రక్‌ను అయితే పేల్చింది.. కానీ, ఆ పేలుడు తీవ్రతకు దానిలోని చాలా సామగ్రి గాల్లోకి చిందరవందర అయ్యాయి. కానీ, ధ్వంసం కాలేదు. దీంతో ఈ హత్యలో రోబో పాత్రను ఇరాన్‌ దర్యాప్తు సంస్థలు చాలా వేగంగానే పసిగట్టాయి. కానీ, ఐఆర్‌జీసీ పరువును దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా అంగీకరించడంలేదు.

ఇదీ చదవండి: ఫక్రజాదే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.