ETV Bharat / international

ట్రంప్​తో జాగ్రత్త- మిత్రదేశాలకు ఇరాన్​ హెచ్చరిక

అమెరికా అధ్యక్ష పదవి నుంచి మరికొన్ని వారాల్లో దిగిపోతున్న ట్రంప్​తో జాగ్రత్తగా ఉండాలని మిత్రదేశాలకు సూచించింది ఇరాన్​. ట్రంప్​ను రెచ్చగెట్టే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Iran's allies on high alert in Trump's final weeks in office
ట్రంప్​తో జాగ్రత్త- మిత్రదేశాలకు ఇరాన్​ హెచ్చరిక
author img

By

Published : Nov 21, 2020, 5:34 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వంపై.. రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని మిత్రదేశాలను హెచ్చరించింది ఇరాన్​. శ్వేతసౌధంలో అధ్యక్షుడిగా తన చివరి రోజుల్లో ఉన్న ట్రంప్.. ఎలాంటి​ దాడులకు పాల్పడే విధంగా చర్యలు చేపట్టవద్దని పశ్చిమాసియా దేశాలకు సూచించింది. ఇరాన్​పై దాడి చేయాలని ట్రంప్​ ఆలోచించినట్టు వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్​ ఈ సూచన చేయడం గమనార్హం.

'ట్రంప్​తో జాగ్రత్త' అన్న సమాచారాన్ని ఇరాన్​​ సైన్యంలోని ఓ సీనియర్​ అధికారి.. మిత్రదేశాలకు స్వయంగా అందించడం ఇరదేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దంపడుతోంది. ట్రంప్​ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడమూ ఇరాన్​ హెచ్చరికలకు ఓ కారణం.

ఇరాన్​తో పాటు దాని మిత్రదేశాలు ట్రంప్​ ఓటమని స్వాగతించాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్​ మధ్య గతకొంతకాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తన ఓటమిని ఇప్పటికీ అంగీకరించని ట్రంప్​.. శ్వేతసౌధంలోని చివరి రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:- ఇరాన్​పై మరోమారు అమెరికా ఆంక్షల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.