ETV Bharat / international

'17 దేశాల్లో భారత్‌ రకం కరోనా వైరస్‌'

author img

By

Published : Apr 28, 2021, 6:08 PM IST

భారత్​లో తొలిసారిగా ఉత్పరివర్తనం చెందిన కరోనా బీ.1.617 రకం ఇప్పటి వరకు 17 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకమని ప్రకటించలేమని పేర్కొంది. మిగతా రకాలతో పోల్చితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

WHO, tedros
'17 దేశాల్లో భారత్‌ రకం కరోనా వైరస్‌'

భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా బీ.1.617 వైరస్‌ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో ఈ కరోనా వైరస్‌ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం తొలిసారిగా భారత్‌లో బయటపడగా యూకే, సింగపూర్‌ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకమని ప్రకటించలేమని పేర్కొంది. ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో వివరించింది.

భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి బీ.1.617 రకానిదే కీలక పాత్ర అయి ఉంటుందని అంచనా వేస్తోంది. ఆరోగ్య ప్రమాణాల పట్ల ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, జన సమూహాలు, నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల కేసులు అమాంతం పెరిగాయని తెలిపింది.భారత్‌లో వెలుగుచూసిన వైరస్‌ కొత్తరకం ప్రాణాంతకం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.

ఈ రకం వైరస్‌పై భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌ , కొవిషీల్డ్‌ టీకాలు మెరుగ్గా పని చేస్తున్నాయని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ వెల్లడించింది.

ఇదీ చూడండి: '617 కొవిడ్ వేరియంట్లపై కొవాగ్జిన్‌ పనితీరు భేష్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.