పేరుకుపోయిన మంచుపై అమెరికా-భారత బలగాల ఫుట్‌బాల్...
పచ్చిక బయళ్లపై అమెరికా సైనికుల కబడ్డీ కూత...
మంచు కోర్టుపై పోటాపోటీగా వాలీబాల్...
భారత్-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ (India US Yudh Abhyas) సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి 29వరకు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో (India America Yudh Abhyas) భారత సైన్యం తరపున 350 మంది జవాన్లు పాల్గొంటున్నారు. అక్కడ అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో (Yudh Abhyas Games) పాల్గొంటోంది. కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో ఇరు దేశాల సైన్యాలు మిశ్రమ జట్లుగా ఏర్పడి తలపడ్డాయి. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న భారత్, అమెరికా బలగాలు విజయం కోసం శ్రమించాయి. (Yudh Abhyas 2021)
భారత క్రీడ అయిన కబడ్డీ ఆడి అమెరికా బలగాలు వహ్వా అనిపించగా... అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలో తలపడి భారత సైన్యం ఆకట్టుకుంది. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి తలపడ్డాయి. క్రీడా స్ఫూర్తిని చాటుతూ మ్యాచ్‌లు అడాయి.
మంచులో సందడి
మంచును ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఇరు దేశాల సైనికులు (India America Yudh Abhyas) సందడి చేశారు. భారత్-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను (Yudh Abhyas Games) నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు.
భారత్- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్‌లో జరిగాయి.
ఇదీ చదవండి: